Maoists: ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, బీజాపూర్ జిల్లాలో భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారి సంఖ్య 103గా ఉంది. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోవడం ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఘటనల్లో ఒకటి

New Update
103

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, బీజాపూర్ జిల్లాలో భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారి సంఖ్య 103గా ఉంది. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోవడం ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఘటనల్లో ఒకటి. లొంగిపోయిన వారిలో 22 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 49 మంది మావోయిస్టులపై రివార్డులు ప్రకటించి ఉన్నాయి. వీరిపై మొత్తం రివార్డు విలువ రూ. 1 కోటి 6 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఒక్కొక్కరిపై రూ. 8 లక్షల చొప్పున

వీరిలో లచ్చు పూనెమ్ అలియాస్ సంతోష్), గుడ్డు ఫర్సా అలియాస్ విజయ్,  భీమా సోధి అలియాస్ కమల్ సింగ్/సుఖ్‌దేవ్ వంటి కీలక కమాండర్లు కూడా ఉన్నారు. వీరి ఒక్కొక్కరిపై రూ. 8 లక్షల చొప్పున రివార్డు ఉంది.మిగతావారిలో నలుగురు మావోయిస్టులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల రివార్డు, 15 మంది కేడర్లకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల రివార్డు, పది మంది కేడర్లకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష రివార్డు, 12 మంది కేడర్లకు ఒక్కొక్కరికి రూ.50,000 రివార్డు, ముగ్గురికి రూ.10,000 రివార్డు ఉంది.  ఈ ఏడాది ఇప్పటివరకు బీజాపూర్ జిల్లాలో 410 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మరో 421 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

తక్షణ సహాయంగా రూ. 50,000

లొంగిపోయిన మావోయిస్టులందరికీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పునరావాస పథకం కింద సహాయం అందించబడుతుంది. లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ తక్షణ సహాయంగా రూ. 50,000 చొప్పున ప్రోత్సాహక చెక్కును ఎస్పీ అందజేశారు. ఈ తక్షణ ఆర్థిక సహాయంతో పాటు, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం జీవనోపాధి మద్దతు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, విద్య మరియు సామాజిక పునరేకీకరణ (social reintegration) కోసం పూర్తి సహాయం అందుతుంది. పోలీస్ అధికారులు మాట్లాడుతూ, హింసను వీడి సమాజంలో తిరిగి కలిసిపోవడానికి, సాధారణ జీవితం గడపడానికి ప్రయత్నించే మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస విధానం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు