/rtv/media/media_files/2026/01/26/fotojet-7-2026-01-26-14-57-27.jpg)
Maoist landmine explodes
Maoist Landmine: ఛత్తీస్‌గఢ్(chhattisgarh ) లోని కర్రెగుట్ట(karregutta news) అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో 11 మంది జవాన్లు గాయపడ్డారు. భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కీలకమైన కర్రెగుట్టల అడవుల్లో ఒకపుడు మావోయిస్టులు తమ స్థావరంగా వినియోగించుకున్నారు. ఆ సమయంలో వారు అక్కడ తమ రక్షణ కోసం మందుపాతరలు అమర్చారు. అయితే ప్రస్తుతం వాటిని సీఆర్పీఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో మందుపాతరలు పేలి 11 మంది భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read : రిపబ్లిక్ డే ముందు పేలుళ్లకు కుట్ర.. పదివేల కిలోల పేలుడు పదార్థాలు సీజ్!
Maoist Landmine Explodes
కర్రెగుట్టల అడవులు(karregutta forest operation) సుమారు 200 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన దట్టమైన అడవులు. ఈ అడవులు దశాబ్దాలుగా మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉండేవి. ఇలాంటి కోటలోకి ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతాదళాలు చొచ్చుకునిపోతున్నాయి. రెగ్యులర్ గా మావోయిస్టు(Maoist Party) లకోసం భద్రతాదళాలు అడవులను గాలిస్తునే ఉన్నాయి. ఈనేపధ్యంలోనే సోమవారం తెల్లవారుజామున ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్(IEDs)లు పేలటంతో కూంబింగ్ చేస్తున్న భద్రతాదళాల్లోని పదకొండుమందికి తీవ్రమైన గాయాలయ్యాయి.
అడవుల్లో తమకోసం గాలింపుచర్యలు చేస్తున్న భద్రతాదళాలను లక్ష్యంగా చేసుకుని గతంలోనే మావోయిస్టులు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మందుపాతరలు అమర్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో రిపబ్లిక్ డే అయిన నేడు భద్రతాదళాలు గాలింపుచర్యలు చేస్తున్న ప్రాంతాల్లో అప్పటికే తమ రక్షణకోసం ఏర్పాటు చేసుకున్న ఐఈడీల్లో ఒకదాని తర్వాత మరోకటి పేలడంతో పదిమంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, ఒక కోబ్రా బెటాలియన్ అధికారికి తీవ్రమైన గాయాలయ్యాయి. విషయం తెలియగానే గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించేందుకు ఉన్నతాధికారులు వారిని హెలికాప్టర్లో రాయపూర్ ఆసుపత్రికి తరలించారు.
గాలింపు చర్యల్లో భాగంగా భద్రతాదళాలు అడవుల్లో చాలా ఐఈడీలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పోయిన ఏడాది ఏప్రిల్-మే నెలలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లలో అనేకమంది మావోయిస్టులు చనిపోగా 35 ఆయుధాలు, 450 ఐఈడీలు, పెద్దసంఖ్యలో డిటోనేటర్లు, వైద్య పరికరాలు, విద్యుత్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విస్తారమైన అడవుల్లో మావోయిస్టులు తలదాచుకోవటానికి వీలుగా అనేక బంకర్లు, సురక్షిత ప్రాంతాలున్నాయి. ఈ విషయాలు తెలుసుకాబట్టే భద్రతాదళాలు కూడా రెగ్యులర్ గా అడవుల్లో కూంబింగ్ చేస్తునే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఈరోజు ఐఈడీలు పేలి 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన బలగాలు మరో 2 మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేశాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే CRPF Jawan కర్రెగుట్టల్లో బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Also Read : బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న డాక్టర్‌కు పద్మ భూషణ్
Follow Us