BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం మరో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

New Update
26 Maoists Killed in Karreguttalu

Kanker Encounter

Kanker Encounter :  మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం మరో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు స్థానిక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని రావాస్ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా మావోయిస్టులు ఎదురు పడటంతో ఈ కాల్పులు జరిగాయని తెలిపారు. 

ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ నిర్వహించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరువురి మధ్య కాల్పులు జరిగాయని వివరించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కాంకేర్, గరియాబంద్ కు చెందిన రాష్ట్ర పోలీస్ యూనిట్ అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు. కాగా.. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే మరణించిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

Also Read: AP Crime: మనసును కలచివేసే ఘటన... అనంతపురంలో వేడి పాల గిన్నెలో పడి బాలిక మృతి

Advertisment
తాజా కథనాలు