Champions Trophy: మేము ఏ జట్టునైనా ఓడించగలము...బంగ్లా కెప్టెన్
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. నిన్న పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఓడిపోయింది. ఈరోజు భారత్-బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాము ఎంత బలమైన జట్టునైనా ఓడించగలము అంటూ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ హెచ్చరించాడు.