/rtv/media/media_files/2025/02/20/uYelqVYAD6pnfemjNd37.jpg)
India Won the Match
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 229 పరుగుల లక్ష్యాన్ని విధించింది. బరిలోకి దిగిన టీమిండియా 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి విజయ సాధించింది. శుభమన్ గిల్ సెంచరీతో (101*) అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ (41*), రోహిత్ (41), విరాట్ (22) పరుగులు చేశారు.
Also Read: డైరెక్టర్ శంకర్‌కు ED బిగ్ షాక్.. కోట్ల ఆస్తులు జప్తు!
శుభమన్ గిల్‌కు తన కేరీర్‌లో ఇది 8వ సెంచరీ. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. మరోవైపు ఇంగ్లండ్ జట్టుపై సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి కూడా తన ఆటతీరును చక్కగా ప్రదర్శించి 41 పరుగులు చేశాడు. తొలి వికెట్‌కు మరో ఓపెనర్ గిల్‌తో కలిసి 10 ఓవర్లలోపే 68 పరుగులు జోడించాడు. మరోవైపు భారత పేసర్ షమీ (5/53) తో తన సత్తా చాటాడు. హర్షిత్ 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు.