Cummins: కోహ్లీ ఇజ్జత్ తీసిన ఆసీస్ కెప్టెన్.. ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఔట్!

కోహ్లీని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ దారుణంగా టీజ్‌ చేశాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం సేవింగ్ యాడ్‌లో నటించిన కమ్మిన్స్ 'హాయ్ కోహ్లీ. నువ్వు చాలా స్లోగా ఆడుతున్నావ్' అంటూ కవ్వించాడు. వీడియో వైరల్ అవుతోంది. ఇక కమిన్స్ ఈ టోర్నీకి దూరమయ్యే ఛాన్స్ ఉంది. 

New Update
kohli

Pat Cummins teased Kohli

Cummins: భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ దారుణంగా టీజ్‌ చేశాడు. మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ(Champion Trophy) మొదలుకానుండగా ఆసీస్ టీమ్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. వరుసగా విఫలమవుతూ పరుగుల దాహంతో ఉన్న కోహ్లీని టార్గెట్ చేసినట్లు తెలుస్తుండగా ఆసీస్ కెప్టెన్ కమిన్స్ కింగ్ కోహ్లీని కవ్వించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Also Read: పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా!

నేను ఎప్పుడు అలా చూడలేదు

ఈ మేరకు ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఓ యాడ్‌ వీడియోలో నటించిన కమ్మిన్స్.. షేవింగ్‌ చేసుకుంటూ అద్దంలో చూస్తూ కనిపించాడు. అయితే ఇందులో ‘హాయ్ కోహ్లీ. నువ్వు ఇప్పటివరకు ఇలా స్లోగా ఆడటం నేను చూడలేదు. ఇటీవల చాలా నెమ్మదిగా ఆడావు’ అంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందిస్తున్న విరాట్ ఫ్యాన్స్.. అనవసరంగా గెలకొద్దు ఛాంపియన్ ట్రోఫీలో మీకు చుక్కలు చూపిస్తాడంటూ సెటైర్స్ వేస్తున్నారు. 

Also Read:TG SC sub-classification: వివేక్ కుట్రతో మాదిగలకు మళ్లీ అన్యాయం.. వర్గీకరణ ఇలా చేస్తారా?: మందకృష్ణ సంచలన ప్రెస్ మీట్!

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆసీస్ ఆల్‌రౌండర్‌ మిచెల్ మార్ష్‌ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవగా తాజాగా ప్యాట్ కమిన్స్ సైతం మెగా టోర్నీ ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. ఇటీవల శ్రీలంక పర్యటనకు దూరంగా ఉన్న కెప్టెన్ పాట్.. చీలమండ సమస్యతో బాధ పడుతున్నట్లు ఆస్ట్రేలియా కోచ్ మెక్‌డొనాల్డ్ తెలిపారు. కమిన్స్‌ ఆడకపోతే స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్‌ ఆస్ట్రేలియా కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. 

Also Read: ప్రముఖ వ్యాపారవేత్త పింకీ రెడ్డి ఫోన్ హ్యాక్! రిప్లై ఇవ్వదంటూ పోస్ట్

Advertisment
తాజా కథనాలు