/rtv/media/media_files/2025/01/16/oPIH1C85PT7wWpRkmji4.jpg)
Champions Trophy 2025
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుండగా టికెట్ల కోసం ఫ్యాన్స్ తెగ ఎగబడుతున్నారు. ఈ మేరకు భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను సోమవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచగా భారీ సంఖ్యలో బుకింగ్స్ చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
లక్షా యాభైవేలమంది పోటీ..
సాధారణ స్టాండ్ టికెట్ల ధర రూ.2,965గా (UAE దిర్హమ్‌లు 125) నిర్ణయించగా టికెట్లన్నీ హాట్‌కేకుల్లా నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్లు వెల్లడించారు. ఇక దుబాయ్ స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 25 వేలు ఉండగా భారత్ Vs పాక్ మ్యాచ్ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో సుమారు లక్షా యాభైవేలమంది పోటీపడినట్లు తెలుస్తోంది.
మార్పులు, చేర్పులకు అవకాశం..
ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుండగా భద్రతా కారణాలరీత్యా భారత టీమ్ పాక్ వెళ్లడానికి నిరాకరించింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. భారత్ ఆడే లీగ్ మ్యాచ్‌లతోపాటు సెమీ ఫైనల్, ఫైనల్ (క్వాలిఫై అయితే) దుబాయ్‌లో జరగనున్నాయి. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇక ఈ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని దేశాలు తమ తుది జట్లను ప్రకటించగా ఫిబ్రవరి 11 వరకు టీమ్‌లలో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా ఆడనుంది.
ఇది కూడా చదవండి: Supreme Court: ఆ రాష్ట్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే ?