Crime News: కాకినాడలో ఘోరప్రమాదం.. అదుపుతప్పిన కారు.. స్పాట్‌లో పదిమంది

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.

New Update
FotoJet - 2025-11-08T103327.979

Fatal accident in Kakinada.. Car out of control.

Crime News: ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు.

శనివారం ఉదయం సోమవారం గ్రామం వద్ద బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపైకి ఒక్క కారు దూసుకెళ్ళింది. అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట వైపు  తిరిగి వెళ్తుండగా కారు ఫ్రంట్ టైర్ పేలి పోయింది. దీంతో కారు అదుపుతప్పి రెండు మోటర్ సైకిల్లను ఒక రిక్షాను వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. గాయలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.

గాయపడిన వారిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిజిహెచ్ కి తరలించారు. కాగా ప్రమాదంపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
 ఈ ఘటనలో సోమవరం  గ్రామానికి చెందిన  మోర్త ఆనందరావు , మోర్త కొండయ్య, ఏలేశ్వరం గ్రామానికి చెందిన బొప్పాయి కాయలు అమ్ముకునే వ్యక్తి కాకాడ రాజు మృతి చెందారు.

ఇది కూడా చూడండి: Wine shops : మందుబాబులకు బిగ్ షాక్..  4 రోజులు వైన్ షాపులు బంద్

Advertisment
తాజా కథనాలు