Justin Trudeau: కెనడా ప్రధాని రాజీనామా.. సొంత పార్టీ నేతల కారణంగానే!
కెనడా ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిబరల్ పార్టీ నాయకత్వానికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. మరో 90 రోజుల్లో కొత్త నాయకత్వం ఎన్నికవగానే తాను బాధ్యతల నుంచి పూర్తి తప్పుకుంటానని ప్రకటించారు.