Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగానే అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట విమానాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. తాజాగా కెనడాలోని టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

author-image
By Manogna alamuru
New Update
flight

canada Flight Accident

ఎయిర్ ప్లైన్ (Airplane) లు గుద్దుకోవడం, కూలిపోవడం లాంటి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఏకంగా బోల్తా పడ్డం ఎక్కడైనా చేశారా. అది కూడా రన్ వే మీద ల్యాండ్ అవుతూ. కొద్దిసేపటి క్రితం కెనడా (Canada) లోని టొరంటోలో ఈ ఘటన జరిగింది. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) లో ప్రమాదం చోటు చేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అమెరికాలోని మిన్నె పొలిస్‌ నుంచి టోరంటోకు వచ్చింది. అక్కడకు వచ్చి ల్యాంగ్ అవుతుండగా..రన్ వే మీద విపరీతమైన మంచు ఉండడంతో స్కిడ్ అయింది. అలా అయిన విమానం వేగంగా వెళ్ళి కాపేటికి బోర్లా పడిపోయింది. పైలట్ ఎంత కంట్రోల్ చేసినప్పటికీ ఫ్లైట్ కంట్రోల్ అవ్వలేదు. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ఫ్లైట్ లో నుంచి ప్రయాణికులను బయటకు తీసి...దగ్గర లోని ఆసుపత్రికి తరలించింది.  

వైరల్ అవుతున్న వీడియో..

రన్ వేపై విమానం జారుతూ బోల్తాపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం జారుతున్నప్పుడు అందులో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపుచేశారు. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనకు కారణం ఇదీ అని ఇప్పుడే చెప్పలేమని...కానీ ప్రాథమికంగా వాతావరణ పరిస్థితులే కారణమని అధికారులు చెబుతున్నారు. టొరంటో విమానాశ్రయం వద్ద ఉష్ణోగ్రత మైనస్‌ 8.6 డిగ్రీలుగా ఉంది. గంటకు 51కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రన్‌వేపై దట్టంగా మంచు పేరుకుపోయిందని అధికారులు చెప్పారు. 

Also Read :  ఏపీలో మహిళలకు తీపికబురు.. వారందరికి ఉచితంగా కుట్టు మిషన్లు

Also Read :  ఎంతకు తెగించావ్రా..  అక్రమసంబంధం కోసం కట్టుకున్న భార్యను..

Also Read :   భారత్ను చూసి బుద్దితెచ్చుకో .. టీమిండియా జెర్సీ పై పాకిస్తాన్ పేరు!

ఎక్కువవుతున్న ప్రమాదాలు...

ఈమధ్య కాలంలో విమానాలు ప్రమాదానికి గురవ్వడం చాలా ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. వాషింగ్టన్ రీగన్ ఎయిర్ పోర్ట్ దగ్గర జరిగిన ప్రమాదంలో 68 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అక్కడ పెను విషాదాన్నే మిగిల్చింది. దాని తరువాత కూడా వరుసగా రెండు సార్లు అమెరికాలో విమానాలు ప్రమాదాలుకు గురైయ్యాయి. ఫిలడెల్ఫియాలో ఇళ్ళు, షాపింగ్ మాల్ మీద ఫ్లైట్ కూలిపోయిన ఘటనలో 10 మంది దాకా చనిపోయారు. రీసెంట్గా టెక్సాస్ లో కూడా మరో విమానం అదుపు తప్పి రోడ్డు మీద ల్యాండ్ అయింది. ఇందులో విమానం రెండు ముక్కలైనట్లు తెలుస్తోంది. అలాగే పలు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే ఈ విమాన ప్రమాదాలకు ఇదీ కారణం అని ప్రత్యేకంగా చెప్పలేకపోతున్నారు. పైలట్లను కూడా తప్పు పట్టడానికి వీలు లేకుం డా పోయింది. 

Also Read :  తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు