/rtv/media/media_files/2025/03/04/CbrDCoWQx96iG7oRmuAZ.jpg)
buffeett
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్దం ప్రమాదకరమైందని దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు. నేటి నుంచి కెనడా, చైనా , మెక్సికో పై భారీ ఎత్తున సుకాల విధింపును అగ్రరాజ్యం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పై బఫెట్ స్పందిస్తూ అది దుందుడుకు చర్య అని పేర్కొన్నారు.
Also Read: North Korea: మా జోలికి వస్తే...అమెరికాకు కిమ్ సోదరి వార్నింగ్!
ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పై తాను కామెంట్ చేయనని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ అడగాల్సిన ప్రశ్నేంటంటే...ఆ తర్వాత ఏంటీ...? మీరు ఎప్పుడూ ఈ మాట అంటుండాలి. మంచిది ...ప్రస్తుతం అదే ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన అంశం.నేను దాని గురించి మాట్లాడను. కష్టం.నిజంగానే మాట్లాడను అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Ap Assembly 2025: ఇంగ్లీష్ వద్దమ్మా.. తెలుగులోనే మాట్లాడండి.. రఘురామ సలహా!
Warren Buffett Slams Donald Trump
94 ఏళ్ల బఫెట్ ను ప్రపంచ ఓ దిగ్గజ ఇన్వెస్టర్ లా భావిస్తుంది.ఆయన ఇచ్చే టిప్స్ , అంచనాలకోసం ఏటా కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. ఆయన నేతృత్వంలోని బెర్క్ షైర్ హత్ వే అమెరికా ప్రభుత్వానికి గత 60 సంవత్సరాలలో 101 బిలియన్ డాలర్ల పై పన్ను రూపంలో చెల్లించింది. ఈ మొత్తం కొన్ని చిన్న దేశాల జీడీపీతో సమానం.
కెనడా,మెక్సికో, చైనా పై ట్రంప్ విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో కెనడా కూడా ప్రతి సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే 155 బిలియన్ డాలర్ల వస్తువుల పై 25 శాతం సుంకాలు వసూలు చేస్తామని వెల్లడించింది. వాస్తవానికి కెనడా,మెక్సికో నుంచి అమెరికా 918 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్లును దిగుమతి చేసుకొంటోంది.
మరో వైపు చైనా తాము కూడా ధీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే అమెరికా వ్యవసాయోత్పత్తులను లక్ష్యంగా చేసుకోవాలని ఆ దేశం భావిస్తోంది. ట్రంప్ నిర్ణయం దెబ్బకు ఆసియా మార్కెట్లు ఒక్కసారిగా పతనం అవుతున్నాయి.
Also Read: China-Trump: చైనా పై ట్రంప్ డబుల్ షాక్.. వాటిని పెంచేసిన అగ్రరాజ్యం!
Follow Us