Canada: భారతీయులకు షాక్ ఇచ్చిన కెనడా ప్రభుత్వం.. స్టడీ, వర్క్ వీసాలపై కెనడా కొత్త రూల్స్..!

కెనడా కూడా వలసదారులపై కొత్త ఆంక్షలు విధిస్తోంది.. అందులో భాగంగా విదేశీ పౌరులకు జారీ చేసే విద్యార్థి, వర్క్ వీసాలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.

New Update
Canada students

Canada students Photograph: (Canada students)

వలసదారుల నిబంధనల్లో కెనడా ప్రభుత్వం (Canada Government) భారీ మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ రెఫ్యూజీ ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్స్‌ పేరుతో రూపొందించిన సరికొత్త నిబంధనలు జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.  వీటి ద్వారా సరిహద్దుల్లోని అధికారులకు మరిన్ని అధికారాలు దఖలుపడ్డాయి. ఎలక్ట్రానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్స్‌ (ఈటీఏ), తాత్కాలిక నివాసా వీసా (టీఆర్‌వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం వీరికి ఉంటుంది. 

Also Read: France: 299 మంది రోగుల పై అత్యాచారం..!

కెనడాకు విద్య, ఉద్యోగాలు, తాత్కాలిక బస కోసం వెళ్లే లక్షల మంది విదేశీయులు ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం ఎక్కువగా పడనుంది. వివిధ కారణాలతో ఈటీఏ, టీఆర్వీ, వర్క్‌ పర్మిట్‌, స్టడీ పర్మిట్లను కెనడా ఇమ్మిగ్రేషన్‌, బోర్డర్‌ అధికారులు రద్దు చేయడానికి వీలుంటుంది.

Also Read: Maha Shivratri 2025: మహాశివరాత్రి స్పెషల్.. రెండు రోజులు సెలవులు!

తప్పుడు సమాచారం ఇవ్వడం, క్రిమినల్‌ రికార్డులు (Criminal Records) వంటి కారణాలను చూపి వీటిని రద్దు చేసేయోచ్చు. అంతేకదు, నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కెనడా నుంచి వెళ్లిపోతానని వీసాదారు సంబంధిత అధికారికి నమ్మకం కలిగించేలా చెప్పలేకపోయినా రద్దు చేస్తారు. పర్మిట్లు రద్దయితే కెనడా నౌకాశ్రయాల్లోకి ప్రవేశించ కూడా అడ్డుకుని.. వెనక్కి పంపుతారు. 

అంతేకాదు, ఇప్పటికే చదువుతున్నా లేదా నివాసం ఉంటున్నా లేదా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పర్మిట్ రద్దయితే నిర్ధిష్ట తేదీలోగా కెనడాను వీడాల్సి ఉంటుందని నోటీసు పంపుతారు.ఈ వర్గాలతో పాటు కెనడాకు పెద్ద సంఖ్యలో వెళ్లే భారతీయ పర్యాటకులకు వేర్వేరు కాల వ్యవధిలో తాత్కాలిక అనుమతులు ఉన్నాయి. గతేడాది మొదటి ఆరు నెలల్లో 3.6 లక్షలకు పైగా భారతీయులకు ట్రావెల్ వీసాలను కెనడా జారీ చేసింది. కెనడా అధికారులు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 2023 మొదటి ఆరు నెలల్లో 3.4 లక్షల మంది భారతీయ పర్యాటకులు ఆ దేశానికి వెళ్లారు. 

Also Read: Telangana: తెలంగాణవాసులకు చల్లటి కబురు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసా!

ముందస్తు చెల్లింపులు...

కొత్త నిబంధనలు వీరిపై కూడా ప్రభావం చూపనున్నాయి. అయితే, ఇప్పటికే పర్మిట్ల కోసం డబ్బు చెల్లించినవారి పరిస్థితి ఏంటి అనేది స్పష్టత లేదు.కాగా, కేవలం మూడు నెలల ముందు నవంబర్ 2024లో కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ లేదా SDS వీసా ప్రోగ్రామ్‌ను ట్రూడో (Trudo) సర్కారు రద్దుచేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు ప్రయోజనం పొందేవారు. విద్య కోసం ముందస్తు చెల్లింపులు చేసే వారికి దీని ద్వారా ప్రాధాన్యత కల్పించేవారు.

Also Read: Trump: మస్క్‌ కు రిప్లై ఇవ్వకపోతే ఉద్యోగుల పై వేటు తప్పదు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు