BRS Party: మేం పార్టీ మారడం లేదు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యేలు!
తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.