Kavitha: కవిత ఎఫెక్ట్..  సంతోష్ రావుకు బిగ్ షాక్!

మాజీ ఎంపీ సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్సీ కవిత. సంతోష్‌ రావు ధనదాహం ఎలాంటిదంటే  నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్ద చనిపోతే ఇక్కడి నుంచి ఫోన్‌ చేసి పోలీసులను ఒత్తిడి చేసిఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టించాడని ఆమె ఆరోపించారు.

New Update
santosh

Kavitha: బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి  సస్పెండ్ అయిన తర్వాత మాజీ ఎంపీ సంతోష్ రావు(MP Santosh Rao)పై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్సీ కవిత. సంతోష్‌ రావు ధనదాహం ఎలాంటిదంటే  నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్ద చనిపోతే ఇక్కడి నుంచి ఫోన్‌ చేసి పోలీసులను ఒత్తిడి చేసిఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టించాడని ఆమె ఆరోపించారు. మూడునాలుగు సార్లు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారన్నారు. దానితో వారి కుటుంబాలు ఏం పని చేసుకోలేని పరిస్థితి నెలకొంది అన్నారు.   నేరం చేసింది సంతోష్‌ అయితే రామన్న పేరు బదనాం అయిందన్నారు. రేవంత్ రెడ్డితో అండర్‌స్టాండింగ్‌ ఉండటం వల్లే టానిక్‌ లాంటి కేసులు మూసేశారంటూ కవిత ఆరోపించారు.

Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!

తాజాగా సంతోష్‌రావుకు బిగ్ షాక్ తగిలింది. తంగలపల్లి పీఎస్‌లో నేరెళ్ల బాధితుల ఫిర్యాదు చేశారు. సంతోష్‌ రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సంతోష్ రావు ప్రోద్బలంతోనే పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపించారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరక పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Also Read: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!

దేశవ్యాప్తంగా సంచలనం

2017లో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మానవ హక్కుల సంఘాలు, రాజకీయ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఇసుక దందా వంటి పెద్ద స్కామ్స్ కేసీఆర్ కు  తెలియకుండానే సంతోష్ రావు చేశారని, తన తండ్రి పేరును వాడుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని కవిత మీడియా సమావేశంలో వెల్లడించారు. సంతోష్ రావు చేసిన ఈ ఇసుక దందా వల్ల పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్‌కు చెడ్డపేరు వచ్చిందని, అమాయకులైన ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కవిత ఆరోపించారు.

Also Read: మోదీతో కారులో మాట్లాడిన సీక్రెట్ లీక్ చేసిన పుతిన్

కాగా  పోచంపల్లి శ్రీనివాస్, నవీన్ రావు వంటి వారికి పదవులు, కాంట్రాక్టులు సంతోష్ రావే ఇప్పించారని, పార్టీలో తన ప్రభావాన్ని చూపించుకుంటూ అనేక లాభాలు పొందారని కవిత ఆరోపించారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆమె బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన తరువాత చేసినవి, ఇవి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆమె పార్టీకి, అలాగే తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. 

Also Read :  New Liquor Policy: మందు బాబులకు గుడ్‌న్యూస్.. ఇకపై హాటల్స్‌లో కూడా బీర్ల అమ్మకాలు

Advertisment
తాజా కథనాలు