/rtv/media/media_files/2025/09/04/ysr-2025-09-04-15-56-16.jpg)
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఇటీవల మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. హరీష్ టీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి లేరని,పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వెళ్లి కలిశారంటూ ఆమె ఆరోపించారు. తాజాగా ఈ ఆరోపణలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో హరీష్ చెప్పిన వివరణకు సంబంధించిన వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే తాను కాలేజీల విషయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసేందుకు తాను వెళ్లానని, ఆ సమయంలో సీఎల్పీలో ఉండే రవిచంద్ తనకు ఓ బోకే ఇచ్చి ఇది సీఎంకు ఇవ్వమని చెప్పారని, అలాగే తాను ఇచ్చానని దానిని ఫోటో తీసి మీడియాలో వేసి తాను పార్టీ మారుతానని ప్రచారం చేశారని హరీష్ చెప్పుకొచ్చారు. ఇదంతా నిమిషాల్లోనే జరిగిందన్నారు. తాను మళ్లీ గంటలోనే వివరణ ఇచ్చుకున్నానని హరీష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : SSMB29: మహేష్ బాబు 'SSMB29' నుంచి సీన్ లీక్.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అంతే!
That day, Harish Rao clearly explained why he met Y. S. Rajasekhara Reddy garu listen to it. Today, this is the answer to the allegations made by @RaoKavithapic.twitter.com/AjKzMFKdua
— Captain Fasak 2.0🎯 (@2Captainparody) September 3, 2025
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆమె సస్పెండ్ అయిన తర్వాత మీడియా సమావేశంలో హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు కలిసి పార్టీని స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నుతున్నారని, కేసీఆర్, కేటీఆర్‌లకు హరీష్ రావు వెన్నుపోటు పొడిచారని, పార్టీని వీక్ చేయడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.
Also Read : New Liquor Policy: మందు బాబులకు గుడ్‌న్యూస్.. ఇకపై హాటల్స్‌లో కూడా బీర్ల అమ్మకాలు
హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణించినప్పటి నుంచి తనపై కుట్రలు మొదలయ్యాయని కవిత అన్నారు. హరీష్ రావు రేవంత్ రెడ్డికి లొంగిపోయారని, అందుకే రేవంత్ రెడ్డి హరీష్ రావును కాపాడుతున్నారని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావులు కలిసి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని కవిత ఆరోపించారు. తన సిబ్బందితో పాటు, కేటీఆర్ బృందం ఫోన్‌లను కూడా వారు ట్యాప్ చేశారని ఆమె పేర్కొన్నారు.
Also read : Ganesh Visarjan Muhurat 2025: గణేశుడి నిమజ్జనానికి 5 శుభ ముహూర్తాలు ఇవే!
ఈ ఆరోపణలు చేసిన తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలను మరింత స్పష్టం చేసింది.
Also Read : Typhoon cyberattacks: చైనా చేతిలో అమెరికా రహస్యాలు.. భయంతో వణికిపోతున్న ట్రంప్