/rtv/media/media_files/2025/09/03/ka-paul-invite-kcrs-daughter-kavitha-join-to-bcs-party-praja-santh-party-2025-09-03-16-15-29.jpg)
KA Paul invite KCR's daughter Kavitha join to BC’s party Praja Santh Party
Kavitha - KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంటారు. తాజాగా కే.ఏ. పాల్ తనదైన శైలిలో చేసిన మరో సంచలన ప్రకటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన అనంతరం కేఏ పాల్ ఆమెకు బంపరాఫర్ ప్రకటించారు.
KA Paul invite Kavitha join to PSP
కవితను తన ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రకారం.. ‘‘ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత బీసీల కోసం పోరాడుతాను అని అంటుంది. నిజంగా కవిత బీసీల కోసం పోరాడాలి అంటే.. బీసీల ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా.. ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు.. నువు బీజేపీ పంపిన భాణం కాదని రుజువు చేసుకో.
చెల్లి రా.. నువ్వు నా పార్టీలో చేరు..!
— RTV (@RTVnewsnetwork) September 3, 2025
కవిత కు కేఏ పాల్ బంపర్ ఆఫర్.. @RaoKavitha#Kapaul#RTVpic.twitter.com/9sS1nETD8k
బీజేపీ రామచంద్రరావు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులను చేసిన రెడ్డిల పార్టీ అంటున్నారు. మరి ఒక దొరసాని అయిన నిన్ను నమ్మాలి అంటే.. ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే.. నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా.. జూబ్లీహిల్స్‌లో పోరాడుదాం. రుజువు చేసుకుందాం.. అందరి మనసుల్ని గెలిపిద్దాం.’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే కేఏ పాల్ ఆహ్వానంపై కవిత నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. ఇప్పుడీ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. అందులో ఆమె సంచలన ప్రకటనలు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆమె ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ఉండటంతో నెట్టింట చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఫోన్ ట్యాపింగ్ అంతా హరీష్ రావు, సంతోష్ రావులే చేయించారని కవిత తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తన ఫ్యామిలీ సభ్యులతో పాటు, కేటీఆర్ ఫ్యామిలీ సభ్యుల ఫోన్లను కూడా వారే ట్యాప్ చేయించారని ఆమె ప్రెస్ మీట్‌లో తెలిపారు. అందరి గుట్టు తమ వద్ద పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని చేజిక్కించుకోవాలని వారు కుట్ర చేశారని ఆమె ఆరోపించారు. తాను తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖను కూడా సంతోష్ రావే లీక్ చేశారని కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరింత ప్రకంపనలు సృష్టించాయి.