Kavitha: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కవిత సంచలన నిర్ణయం!

బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ పెద్దగా ప్రాధాన్యత  దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేల జాబితానే రెడీ చేయాలని కవిత తన అనుచరులకు చెప్పినట్లుగా సమాచారం.అంతేకాకుండా ఉద్యమంలో యాక్టివ్‌గా పని‌ చేసిన ఉద్యమ‌కారులను కవిత కలబోతున్నట్లుగా తెలుస్తోంది.

New Update
kavitha

Kavitha: బీఆర్ఎస్ పార్టీకి(BRS Party),  ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని ఇప్పటికే  ప్రకటించారు కవిత. దీంతో ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పకనే చెప్పేశారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అందుకు అనుగుణంగానే కవిత అడుగులు కూడా వేస్తున్నారు. ఇవాళ ఆమె తన ప్రధాన ఆనుచరులు, జాగృతి ముఖ్య నేతలతో రహస్యంగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ తాను పార్టీ పెడితే తన వెంట నడిచేది ఎవరు అనే  విషయంపై కవిత ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. 

Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!

బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ పెద్దగా ప్రాధాన్యత  దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేల జాబితానే రెడీ చేయాలని కవిత తన అనుచరులకు చెప్పినట్లుగా సమాచారం. అంతేకాకుండా తెలంగాణ(Telangana Political) ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యాక్టివ్‌గా పని‌ చేసిన ఉద్యమ‌కారులను కవిత త్వరలో కలబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె వారిని జాగృతిలో చేరాలని కోరబోతున్నట్లుగా సమాచారం. కవిత తీసుకునే ఈ నిర్ణయాల వలన బీఆర్ఎస్ కు కోలుకుని నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also Read: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతో బీఆర్ఎస్ పార్టీ కవితను  సస్పెండ్ చేసింది. దీనితో, కవిత పార్టీకి, అలాగే తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సస్పెన్షన్ తర్వాత కవిత మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి కేసీఆర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తాను ఎప్పుడూ ప్రజల కోసం పోరాడానని, తన కార్యకలాపాలు ఎలా పార్టీ వ్యతిరేకం అవుతాయని ప్రశ్నించారు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.

Also Read :  New Liquor Policy: మందు బాబులకు గుడ్‌న్యూస్.. ఇకపై హాటల్స్‌లో కూడా బీర్ల అమ్మకాలు

దీపావళికి పార్టీ లాంచ్

కవిత బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయ్యాక ఆమె కొత్త పార్టీని స్థాపించబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. 'తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి' అనే పేరును ఆమె  పరిశీలిస్తున్నారని, దీపావళికి పార్టీని లాంచ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది పార్టీలు పెట్టారు.  గతంలో మర్రి చెన్నారెడ్డి, తూళ్ల దేవేందర్ గౌడ్, మెగాస్టార్ చిరంజీవి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, విజయశాంతి, వైఎస్ షర్మిల పెట్టిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. టీడీపీ తరువాత ఏర్పాటైన టీఆర్ఎస్, జనసేన పార్టీలు మాత్రమే ఎదిగి అధికారాన్ని సాధించాయి. మరి కవిత తిరుగులేని శక్తిగా రాజకీయాల్లో ఎదుగుతారా లేదా అన్నది చూడాలి. 

Also read :  Ganesh Visarjan Muhurat 2025: గణేశుడి నిమజ్జనానికి 5 శుభ ముహూర్తాలు ఇవే!

Advertisment
తాజా కథనాలు