/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)
Kavitha
అనుకున్నదే జరిగింది. ఎమ్మెల్సీ కవితకు ఆమె తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఊహించని షాకిచ్చారు. పార్టీ నుంచి ఆమెను బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నోట్ ప్రిపేర్ చేసిన బీఆర్ఎస్ మరికాసేపట్లో అధికారికంగా విడుదల కానుంది. నిన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ లపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. దీంతో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు పార్టీ ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత సంచలన కామెంట్స్ చేశారు. కవిత కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె కొత్త పార్టీని పెట్టనున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తైనట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాక ఆమె కొత్త పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
#RapidNews | బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ!
— Rapid News (@RapidNewsOffl) September 2, 2025
కొంతకాలంగా పార్టీ నేతలపై కవిత విమర్శలు, పార్టీ లైన్ దాటడంతో బహిష్కరణ వేటు. #BRS#Kavitha#TelanganaPolitics