Kavitha: తెలంగాణ జాగృతిలో చీలిక.. కవితకు బిగ్ షాక్!

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవితకు మరో షాక్ తగిలింది. తెలంగాణ జాగృతి సంస్థలో చీలిక ఏర్పడింది. జాగృతి నాయ‌కుడు మేడే రాజీవ్ సాగ‌ర్ కవితపై సంచలన కామెంట్స్ చేశారు.

New Update
kavitha (1)

Kavitha: బీఆర్ఎస్(BRS Party) నుంచి సస్పెండ్ అయిన కవితకు మరో షాక్ తగిలింది. తెలంగాణ జాగృతి సంస్థలో చీలిక ఏర్పడింది. జాగృతి నాయ‌కుడు మేడే రాజీవ్ సాగ‌ర్ కవితపై సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోసమే తెలంగాణ జాగృతికి ప‌ని చేశామ‌న్నారు. తమను కవిత వాడుకుని ఇప్పుడు రోడ్డు మీద పడేశారని  రాజీవ్ సాగ‌ర్ నిప్పులు చెరిగారు. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో జాగృతి నాయ‌కులు మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా కవిత మాట్లాడినప్పటి నుండి తామంతా తెలంగాణ జాగృతికి దూరం అయ్యామని తెలిపారు. కవిత లేఖ రాసినప్పటి నుండే కేసీఆర్‌కు ఆమె వ్యతిరేకం అయ్యారన్న ఆయన అప్పటి నుండే మేము జాగృతిని దూరం పెట్టామ‌ని రాజీవ్ సాగ‌ర్ వెల్లడించారు. 

Also Read: Ganesh Visarjan Muhurat 2025: గణేశుడి నిమజ్జనానికి 5 శుభ ముహూర్తాలు ఇవే!

కేసీఆర్ కోసమే పని చేస్తాం

జాగృతి నాయకులం ఎప్పుడూ కేసీఆర్ కోసమే పని చేస్తామని అన్నారు రాజీవ్ సాగర్ .. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న తాము దానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. కవిత సామాజిక న్యాయం అని మాట్లాడుతున్నారని, ఆమెకు 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చాయని, కానీ వారి వెనక ఉన్న వారికి సామాజిక న్యాయం జరిగిందా అని రాజీవ్ సాగ‌ర్ ప్రశ్నించారు. 

Also Read: New Liquor Policy: మందు బాబులకు గుడ్‌న్యూస్.. ఇకపై హాటల్స్‌లో కూడా బీర్ల అమ్మకాలు

కవిత తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితం అవుతున్నట్లు కనిపిస్తున్నాయని మేడే రాజీవ్ సాగర్ ఆరోపించారు. కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసే తెలంగాణ జాగృతి.. ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరి ఆశయం కోసం పనిచేస్తున్నారు? అని కవితన  ప్రశ్నించారు. మొత్తంగా  జాగృతి లోపలి విభేదాలు భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also Read: SSMB29: మహేష్ బాబు 'SSMB29' నుంచి సీన్ లీక్.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అంతే!

Advertisment
తాజా కథనాలు