చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మినిస్టర్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి క్యాంప్ గేట్లు బద్ధలు కొట్టి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. హరీష్రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యారంగానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేఖలో డిమాండ్ చేశారు.
TG: పెన్షన్ దారులను కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికల సమయంలో రూ.2వేలుగా ఉన్న పెన్షన్ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి మాట తప్పిందని ఫైర్ అయ్యారు. దీనిపై పెన్షన్ దారులకు ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
TG: పత్తి విత్తనాల కొరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డుకు రెండు పత్తి బ్యాగుల చొప్పునే పంపిణీ చేయడంతో రైతులు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులు, యువతను పొట్టనపెట్టుకున్న హంతకుడన్నారు. అలాంటి వ్యక్తి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో గద్దె మైల పడిందంటూ పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.