BRS Party : మైనంపల్లికి బిగ్ షాక్ ఇచ్చిన హరీష్ రావు.. బీఆర్ఎస్ లో చేరిన అనుచరులు!

కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుకు ఆ పార్టీ నాయకులు షాక్‌ ఇచ్చారు. మొదక్‌ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరారు.

New Update
Corporators jain brs

Corporators jain brs

BRS Party : కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుకు ఆ పార్టీ నాయకులు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. మొదక్‌ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈ రోజు బీఆర్‌ఎస్‌ లో చేరారు. మెదక్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. మెదక్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు.

Also read:  ఛీ.. ఛీ.. ఇంటర్నెట్‌కు కూడా ఇబ్బందులు.. పాక్ నుంచి పారిపోతున్న కంపెనీలు!

 మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ మెదక్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టం. మెదక్ జిల్లా కలను నిజం చేసింది కేసీఆర్ అన్నారు.నాలుగు లైన్ల రోడ్లు, డివైడర్లు, అద్భుతంగా ఉన్నాయి. సిద్దిపేట అంటే పందులు, మెదక్ అంటే గాడుదులు ఎక్కువ ఉండే అనేవాళ్ళు. ఇప్పుడు అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ కరోనా ఉన్నా, కష్టం ఉన్నా రైతుబంధు ఆపలేదన్నారు.మెదక్ జిల్లా పరిషత్, మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురుతుందని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మల్ల కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలని అంటున్నారని గుర్తు చేశారు.

Also Read : ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మెదక్‌లో ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయి. వాటి సంగతిని బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటారన్నారు. రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాతపెట్టాల్సిన సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి లేకి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదన్నారు.రేవంత్ రెడ్డిని గ్రామాల్లో తిడుతున్న తిట్లు ఇప్పటిదాకా చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని తిట్టలేదన్నారు.సిగ్గు శరం ఉన్నోడు అయితే ఈపాటికి బకెట్ నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకునేవాడు. రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం,మానం, ఇజ్జత్ లేదు కాబట్టే పట్టించుకోవడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.పూర్వ మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలు, అన్ని పార్లమెంట్ స్థానాలు, మూడు జిల్లా పరిషత్‌లను బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందన్న విశ్వాసం నాకు ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను, హరీష్ రావు గారు అండగా ఉంటామని కేటీఆర్‌ వివరించారు. హరీష్ రావు గారి నాయకత్వంలో తిరిగి జిల్లాలో బీఆర్ఎస్ జెండా సగర్వంగా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేవరకు మనమందరం కష్టపడదామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Also Read: వామ్మో.. మనిషిని మింగేసిన భారీ కొండచిలువ.. వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు