Harish Rao : మా వల్లే బనకచర్లకు అనుమతి నిరాకరణ : హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్  ప్రతిపాదించిన పోలవరం-,బనకచర్ల ప్రాజెక్టు కు అనుమతులు ఇవ్వలేమని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు స్వాగతించారు. ఇది తెలంగాణ ప్రజల విజయం అని ఆయన తేల్చి చెప్పారు.

New Update
Polavaram-Banakacharla project

Harish Rao :  ఆంధ్రప్రదేశ్  ప్రతిపాదించిన పోలవరం-,బనకచర్ల ప్రాజెక్టు కు అనుమతులు ఇవ్వలేమని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు స్వాగతించారు. కేంద్ర జలసంఘం, ప్రాజెక్టు గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పును(GWDT) పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఆయన హర్షం వ్యక్తం చేశారు.  బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని హరీష్‌రావు ఆరోపించారు.

ఇది కూడా చదవండి: రాత్రి పడుకునే ముందు పాలు తాగుతున్నారా..? దాని దుష్ప్రభావాలు ఇవే

ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ, నాయకులు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి వివరాలు, ఆధారాలతో నిలదీయడం వల్లే కేంద్రం దిగివచ్చిందని స్పష్టం చేశారు. ఇది బీఆర్‌ఎస్‌ తో పాటు తెలంగాణ ప్రజల విజయం అని ఆయన తేల్చి చెప్పారు. బనకచర్ల పేరిట తెలంగాణ వాటకు వచ్చే గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయేందుకు  ఏపీ సర్కార్‌ కుట్రలు చేసిందని ఆయన ఆరోపించారు. అలాంట సమయంలో కేంద్ర నిర్ణయం ఏపీ కుట్రలకు   చెంపపెట్టు అని అన్నారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: నిమ్మకాయ నీటిలో నల్ల ఉప్పు కలిపి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు