Congress : 40 ఏళ్ల తరువాత అక్కడ లోక్ సభ స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్!
కాంగ్రెస్ పార్టీ యూపీలోని అలహాబాద్ లోక్ సభ స్థానాన్ని సుమారు 40 సంవత్సరాల తరువాత గెలిచింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ నుంచి నీరజ్ త్రిపాఠి, కాంగ్రెస్ నుంచి ఉజ్వల్ పోటీ చేశారు.ఉజ్వల్ బీజేపీ అభ్యర్థి పై సుమారు 58 వేల పై చిలుకు మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.