BJP First List: ఒక పక్క హర్యానాలో కాంగ్రెస్–ఆప్ ల మధ్య పొత్తు కుదరడం లేదు. మరోవైపు బీజేపీ మాత్రం తన ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసేసింది. అక్టోబర్ 5న జరిగే ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం అంటోంది బీజేపీ మొదటి విడతగా 67 మందితో కూడిన అభ్యర్ధుల లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇక్కడ ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి అధికారం దక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. అయితే ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్లు పంపకాలపై ఇంకా చర్చలు జరుగుతతూనే ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Haryana: బీజేపీ తొలి జాబితా విడుదల..సీఎం సైనీ పోటీ ఎక్కడ నుంచి అంటే..
హర్యానాలో ఎన్నికలకు బీజేపీ రెడీ అయిపోతోంది. ఇక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 67 మందితో కూడిన లిస్ట్‌ను ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సైనీ లాడ్వా నుంచి పోటీ చేయనున్నారు.
Translate this News: