Latest News In Telugu KCR Delhi Tour: ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈవారంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడటం, లోక్సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. By B Aravind 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: కవితపై విచారణ జరుగుతోంది.. ఎప్పటికైనా అరెస్ట్ తప్పదు: లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీజేపీ ఒంటరిగానే 17 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. అలాగే కవితపై విచారణ జరుగుతోందని, ఆధారాలు లభిస్తే దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయని చెప్పారు. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul VS Smriti : అమేథి నియోజకవర్గంలో ఎదురుపడనున్న రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ! రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రతో అమేథీ చేరుకున్నారు. దీంతో పాటు ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా జన్ సంవద్ యాత్ర కూడా చేయనున్నారు. అమేథీలో ఒకేరోజు రాహుల్-ప్రియాంక, స్మృతి ఇరానీలు హాజరుకావడంతో ఇరు పార్టీల మద్దతుదారుల ఉత్సాహం తారాస్థాయికి చేరనుంది. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : డబుల్ హ్యాట్రిక్.. మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా! ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మరోసారి డుమ్మా కొట్టారు. దీంతో ఇప్పటి వరకు ఆయన ఆరుసార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టి రికార్డులు తిరగరాస్తున్నారు. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kamal Nath : నేను పార్టీని వీడుతున్నట్లు ఎక్కడైనా మాట్లాడానా..? : కమల్ నాథ్! గత రెండు రోజులుగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత , మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తోసిపుచ్చారు. పార్టీ మారుతున్నట్లు ఎక్కడా కూడా నేను ఎవరితోనూ మాట్లాడలేదని పేర్కొన్నారు. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandigarh : సుప్రీం తీర్పుకు ముందే ఛండీగఢ్ మేయర్ రాజీనామా! ఛండీగఢ్ కొత్త మేయర్ మనోజ్ సోంకర్ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడానికంటే ముందే తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ముగ్గురు ప్రతిపక్ష కౌన్సిలర్లు బీజేపీలో చేరిన తరుణంలో రాజీనామా వార్త వచ్చింది. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Krishna Reddy: తిరిగి బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి? కాంగ్రెస్లో చలమల కృష్ణా రెడ్డి చేరికపై గందరగోళం నెలకొంది. ఆయన చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అందెం సంజీవ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చలమల కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు. దీంతో ఆయన తిరిగి బీజేపీలో చేరుతారనే చర్చ జోరందుకుంది. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Niranjan Reddy: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. మాజీ మంత్రి నిరంజన్ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తుందని సెటైర్లు వేశారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI Narayana: మోడీ ఉగ్రవాది. . బీజేపీకి ఓటు వేసే వారు ద్రోహులే: సీపీఐ నారాయణ తెలుగు ప్రజానీకానికి ప్రధాని మోడీ ఉగ్రవాదని అన్నారు సీపీఐ నారాయణ. బీజేపీకి ఓటు వేసే తెలుగు వారు ద్రోహులే అని అన్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయిందని అన్నారు. స్వార్థం కోసం ఏపీలో రాజకీయ పార్టీలు బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాయని విమర్శించారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn