BIG BREAKING : హైదరాబాద్ లో హైటెన్షన్...  రాంచందర్‌రావు అరెస్ట్!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

New Update
arrest

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా మరికొందరు బీజేపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తత దృష్ట్యా కామారెడ్డికి వెళ్లేందుకు.. అనుమతి లేదని పోలీసులు చెబుతుంటే.. కామారెడ్డికి వెళ్లి తీరుతామని రాంచందర్‌రావు అంటున్నారు. రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్ తో అక్కడికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా BJP కార్యకర్తల నినాదాలు చేస్తున్నారు.  నిరసనకారులు, పోలీసులు మధ్య తోపులాటలతో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది.

మరోవైపు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీ రాజ్యం'నడుపుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కామారెడ్డిలో నెలకొన్న ఉద్రిక్తతలు, బీజేపీ నేతల హౌస్ అరెస్టులపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని మండిపడ్డారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య. ప్రశ్నిస్తే దాడులు చేయడం కాంగ్రెస్ నైజంగా మారిందన్నారు.  బాన్సువాడలో అన్యాయంగా 70 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎంఐఎం నేతలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయపడుతోందని ఆరోపించారు.  కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీయే. రాళ్ల దాడి స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్దారు. 

కాంగ్రెస్ నేతలకు గట్టి కౌంటర్

మరోవైపు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్రమాలను అడ్డుకుంటున్నందుకే నాపై కక్ష కట్టారు.. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఇప్పుడే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. అరోరా కాలేజీలు, శిశుమందిర్ భూముల భాగోతం అందరికీ తెలుసని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు. తనను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామన్న వారికి, తనే స్వయంగా వస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు.

Advertisment
తాజా కథనాలు