BIG BREAKING: మహబూబాబాద్ జిల్లాలో హంగ్.. చైర్మన్ పీఠం కోసం BRS మాస్టర్ స్కెచ్!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీ ఫలితాల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే ఆసక్తిగా మారింది. రెండు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి.

New Update
FotoJet (2)

Hung in Mahabubabad district..

BIG BREAKING: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీ ఫలితాల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే ఆసక్తిగా మారింది. రెండు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. ఇక్కడ చైర్మన్ పీఠం దక్కాలంటే కావాలసిన మ్యాజిక్ ఫిగర్ 19. అయితే ఇక్కడ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల్లో గెలుపొందగా, బీఆర్ఎస్ పార్టీ 13 వార్డుల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే ఇక మిగిలిన స్థానాల్లో సీపీఐ 3 స్థానాలు గెలవగా, ఇండిపెండెంట్లు 4 స్థానాలు, బీజేపీ ఒక వార్డులో విజయం సాధించాయి.

ఇక్కడ చైర్మన్ పీఠం దక్కాలంటే కాంగ్రెస్ కు సీపీఐ, ఇండిపెండెంట్ల, బీజేపీ అభ్యర్థుల మద్దతు కావాలి. బీఆర్ఎస్ కు సీపీఐ, ఇండిపెండెంట్ల మద్దతు అవసరం దీంతో రెండు పార్టీలు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగా మిగిలిన పార్టీల కౌన్సిలర్లతో చర్చలు సాగిస్తున్నారు.ఇక్కడ ఇండిపెండెంట్. సీపీఐ అభ్యర్థుల మద్దతు కోసం రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో కమ్యూనిస్టుల మద్దతు ఎవరికి అనేది ఆసక్తిగా మారింది. చైర్మన్ పీఠం ఏ పార్టీని వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది. అయితే  వరించనుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ 13 స్థానాలు గెలవడంతో ఈ మున్సిపాలిటీని ఎలాగైన దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా ఆరుగురి మద్ధతు అవసరం పడటంతో సీపీఐ, ఇండిపెండెంట్ల మద్ధతుకోసం ప్రయత్నిస్తుంది. చర్చలు ఫలిస్తే చైర్మన్ పదవి బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ సీపీఐ. ఇండిపెండెంట్లలలో ఎవరో ఒకరు మాత్రమే మద్ధతు ఇస్తే ఎక్స్‌ఆఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. 

కేసముద్రంలోనూ నువ్వా..నేనా?

ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన కేసముద్రం మున్సిపాలిటీలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మొత్తం స్థానాలు 16.. కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 స్థానాల్లో గెలవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఎక్స్‌ఆఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. చైర్మన్ స్థానాన్ని ఎలాగైన దక్కించుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను క్యాంప్‌నకు తరలించింది, ఇక్కడ.. మరో మూడు ఎక్స్‌ఆఫీషియో ఓట్లు నమోదుకు బీఆర్ఎస్ వ్యూహం పన్నింది.. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీ గాయత్రి రవి(వద్దిరాజు రవిచంద్ర) ఎక్స్‌ఆఫీషియో ఓట్లు నమోదు చేయాలని నిర్ణయించింది.. దాంతో కేసముద్రంలో బీఆర్ఎస్ బలం11కు పెరగనుంది.దీంతో మ్యాజిక్ ఫిగర్ ను దాటనుంది. అయితే కేసముద్రం సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి సొంత మండలం కావడంతో పాటు ఆయన స్వయంగా ప్రచారం చేయడంతో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ ఎక్స్‌ఆఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ ఎక్స్‌ఆఫీషియో సభ్యులుగా ఉన్నారు. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీ గాయత్రి రవి(వద్దిరాజు రవిచంద్ర) ఎక్స్‌ఆఫీషియో సభ్యులుగా ఉన్నారు. మహబూబాబాద్ లో సీపీఐ, ఇండిపెండెంట్లు ఎవరికి మద్దుతు ఇస్తే వారే చైర్మన్ అయ్యే అవకాశం ఉండటంతో రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే కాంగ్రెస్ కే చైర్మన్ దక్కనుంది. కే సముద్రంలో టై కావడంతో బీఆర్ఎస్ ఎక్స్‌ఆఫీషియో ఓట్లతో బీఆర్ఎస్ సునాయాసంగా గెలవగలదు. ఇక్కడ ఎక్స్‌ఆఫీషియో ఓట్లు వినియోగించుకుంటే మహబూబాబాద్ వదులు కోవలసి వస్తుంది. మహబూబాబాద్ ఫలితాలపై కేసముద్రం భవితవ్యం ఆధారపడి ఉండటంతో రెండు మున్సిపాలిటీల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది.

Advertisment
తాజా కథనాలు