Kamareddy: కామారెడ్డిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. కారుకు నిప్పు

కామారెడ్డిలో కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య నెలకొన్న మాటల యుద్ధం సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది.

New Update
FotoJet (28)

Tension in Kamareddy.. Attack on MLA's house.. Car set on fire.

Kamareddy Land Dispute : కామారెడ్డిలో కాంగ్రెస్‌(congress), బీజేపీ(bjp) నేతల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(sabbir-ali), కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి(kamareddy mla katipally venkataramana reddy) మధ్య నెలకొన్న మాటల యుద్ధం సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది. దీంతో ఇరువురు నాయకులు చర్చకు కుర్చుందామని సవాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వచ్చారు.  క్యాంపు కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న బీజేపీ కార్యాకర్తలు మహేందర్‌ రెడ్డిని అడ్డుకున్నారు. ఆయన కారును ధ్వంసం చేయడంతో పాటు ఆయనపై దాడి చేశారు. 
పరిస్థితి చేయి దాటి పోవడంతో లీసులు మహేందర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు మహేందర్‌రెడ్డి కారును ధ్వంసం చేయడంతో పాటు దాన్ని పల్టీ కొట్టించి నిప్పు పెట్టారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా ఎమ్మెల్యేను బయటకు రాకుండా హౌజ్‌ అరెస్ట్‌ చేశారు.

FotoJet (27)

Also Read :  విశాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. హైదరాబాద్‌ నుంచి వెళ్లి లాడ్జిలో..

అసలేం జరిగిందంటే? 

ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సందర్భంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జా వ్యవహారంపై షబ్బిల్‌అలీ,కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వివాదం చెలరేగింది. దీంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.ఈ వివాదంపై నిజానిజాలు తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు. స్థానికి శిశుమందిర్‌ ఆవరణలో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. దీంతో కామారెడ్డిలో  హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. శిశుమందిర్ పాఠశాల వద్దకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరుకోవడంతో ఒక్కసారిగా హైటెన్షన్‌ నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.ప్రభుత్వ కళాశాల భూములు, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రమణారెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని, సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

కాగా స్థానికి శిశుమందిర్ వేదికపై బహిరంగ చర్చకు రెండు పార్టీలు సిద్ధపడ్డాయి. ఇరు పార్టీల నేతల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ ఆఫీసు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఎమ్మెల్యేను హౌజ్ అరెస్ట్ చేశారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయనను బయటకు రాకుండా నిర్బంధించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి మరో ప్రకటన విడుదల చేశారు. ఎవరూ కూడా శిశుమందిర్ వద్దకు రావొద్దని కోరారు. ఇది తన కుటుంబంపై చేసిన ఆరోపణ అని, తానే నిరూపించుకుంటానని ఆయన అన్నారు.

కాగా ఎమ్మెల్యే రమణారెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరించిన కాంగ్రెస్ నేతలు  పెద్ద ఎత్తున క్యాంపు ఆపీసుకు చేరుకున్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆయన అవినీతిని నిరూపిస్తామంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతేకాక రమణారెడ్డి ఇంటి వద్దకు, చర్చ వేదికగా నిర్ణయించిన శిశుమందిర్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివిధ మార్గాల్లో శిశుమందిర్ వద్దకు రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు భద్రతను మరింత పెంచారు. అయినప్పటికీ, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రమణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వారిని  బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాక కాంగ్రెస్ నేతల కారుపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసి పల్టీలు కొట్టించారు. అనంతరం నిప్పు పెట్టారు. ఇరు పార్టీల నేతలను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read :  నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ కేసులో కీలక మలుపు.. ఫైల్స్ అన్ని దగ్ధం

Advertisment
తాజా కథనాలు