• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

Municipal Elections: ఆ రెండు కార్పొరేషన్లు ఎవరి ఖాతాలోకి ? కాంగ్రెస్‌, బీజేపీల మధ్య దోబుచులాట ?

కరీంనగర్‌, నిజామాబాద్‌ మేయర్‌ ఎన్నికను కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అనుకున్న ఫలితం దక్కలేదు. రెండింట్లోనూ బీజేపీ అతిపెద్ద పార్లీగా అవతరించింది. అయినప్పటికీ ఇండిపెండెంట్ల మద్దతుతో రెండు స్థానాలు కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉంది.

author-image
By Madhukar Vydhyula 16 Feb 2026 in తెలంగాణ Latest News In Telugu
New Update
FotoJet (12)

Whose account are those two corporations?

Follow Us

Municipal Elections: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం నేటి  ఉదయం 11:30 గంటలకు జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, ఛైర్మన్ల ఎన్నికను పూర్తి కానుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే కీలకమైన కార్పొరేషన్లలో 'హాంగ్' ఏర్పడటంతో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. మేయర్, ఛైర్మన్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపడంతో రాష్ట్రవ్యాప్తంగా  తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.

నిజామాబాద్, కరీంనగర్‌లో మేయర్‌ పీఠం ఎవరిదో?

రాష్ట్రం లోని 7 కార్పొరేషన్లలో నాల్గుంటిలో కాంగ్రెస్‌ పూర్తి మెజారిటీ సాధించింది. కొత్తగూడెం మేయర్‌ స్థానం సీపీఐతో కలిసి పంచుకోనుంది. అయితే ప్రధానమైన కరీంనగర్‌, నిజామాబాద్‌ మేయర్‌ ఎన్నికను కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అనుకున్న ఫలితం దక్కలేదు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా కేవలం 14 స్థానాలు, నిజామాబాద్‌ లో 60 డివిజన్లు ఉండగా 17 స్థానాలకే పరిమితమైంది. ఈ రెండింటిలో బీజేపీ ఘననీయంగా డివిజన్లను గెలుచుకుంది. కరీంనగర్‌లో 30 డివిజన్లు, నిజామాబాద్‌ లో 28 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే స్థానికంగా గెలిచిన స్వతంత్రులను కలుపుకుని మేయర్‌ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నించిన బీజేపీకి కాంగ్రెస్‌ చెక్‌ పెట్టింది. స్వతంత్రులను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సఫలమైంది. దీంతో ఆ రెండు మేయర్ స్థానాలుకూడా కాంగ్రెస్ కు సొంతమయ్యు అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

అతిపెద్ద పార్టీగా అవతరించినా...

కరీంనగర్‌లో బీజేపీ 30 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్ 9 స్థానాల్లో గెలుపొందాయి. ఇక్కడ స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేశాయి. మొదట వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపినప్పటికీ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, ఇండిపెండెంట్ల మద్ధతుతో మేయర్‌ పీఠంపై కన్నేసింది.అయితే చివరినిమిషంలో ఏం జరుగుతుందో ఈ రోజు మధ్యాహ్నానికి తేలనుంది.నిజామాబాద్ కార్పొరేషన్ లోని మొత్తం 60 డివిజన్లలో బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 స్థానాల్లో విజయం సాధించాయి. మేయర్ పీఠానికి అవసరమైన 31 మార్కును ఏ పార్టీ అందుకోలేకపోవడంతో ఎంఐఎం మద్దతు కీలకంగా మారింది. అయితే ఎంఐఎం బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఈ స్థానం కూడా కాంగ్రెస్‌కే దక్కే అవకాశం ఉంది.  దీంతో ఈ రెండు కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్‌ స్థానంలో కూర్చోలేకపోవడంతో ఆ పార్టీ నాయకుల్లో నైరాశ్యం నెలకొంది.

కొత్తగూడెంలో  ఉత్కంఠకు తెర

కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఎవరూ ఊహించని విధంగా సీపీఐ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌, సీపీఐ చెరి 22 సీట్లలో విజయం సాధించాయి. బీఆర్‌ఎస్ 8 స్థానాలు, ఇండిపెండెంట్లు మరో 8 స్థానాల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో మొదట మేయర్‌ పీఠం తమకే కావాలనే పట్టుబట్టిన సీపీఐ ఆ తర్వాత కాంగ్రెస్‌ తో జరిపిన చర్చలతో చల్లబడింది. మేయర్ పీఠంపై ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.పదవుల పంపకం: మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించారు.ఒప్పందం ప్రకారం, మొదటి రెండున్నరేళ్లు సీపీఐకి మేయర్ పీఠం దక్కనుంది. ఆ తర్వాత కాంగ్రెస్‌కు దక్కనుంది.

#mim #bjp #brs #congreess #Nizamabad Municipal Election #Karimnagar Muncipal Election Updates #Karimnagar Muncipal Election #Muncipal Election
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు
    తదుపరి కథనాన్ని చదవండి
    newsletter_logo
    మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

    RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


    https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

    https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


    Quick Links

    • About Us
    • Disclaimer
    • Contact Us
    • Feedback & Grievance
    • Advertise With Us
    • Privacy Policy


    Copyright © 2024 · Rayudu Vision Media Limited

    Powered by