/rtv/media/media_files/2026/02/13/telangana-bjp-chief-ram-chander-rao-2026-02-13-19-24-09.jpg)
Telangana BJP Chief ram chander rao
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని తెలిపారు. ఇప్పటిదాక వెలువడిన ఫలితాల్లో 250 వార్డుల్లో గెలిచామన్నారు. 6 మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందని తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో గెలవనున్నామని ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేట, రాయికల్, ఆదిలాబాద్‌లో తమ పార్టీ అభ్యర్థులే ఛైర్మన్లు అవుతారని పేర్కొన్నారు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఆర్థిక సాయం
BJP Chief Ramchander Rao Responds On Muncipal Election Results
'' మున్సిపల్ ఎన్నికల ఫలితాలు(Telangana Municipal Election Results 2026) మేము ఆశించిన మేరకే ఉన్నాయి. పలు జిల్లాల్లో ఆశించినంత రాలేదు. రాష్ట్రంలో మొత్తం వార్డులు, డివిజన్లు కలిపి 350 స్థానాల్లో గెలిచాం. త్రిముఖ పోరు వల్ల బీజేపీకి కొంత నష్టం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక డివిజన్, అశ్వారావుపేటలో ఒక వార్డులో గెలిచాం. కాంగ్రెస్‌కు అనుకున్న ఫలితాలు రాలేదు. చాలాచోట్ల హంగ్ వచ్చింది. రాష్ట్ర ప్రజలు మంచి తీర్పునిచ్చారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, BRS, మజ్లీస్ కలిసి పనిచేశాయి. అందుకే బీఆర్ఎస్కు ఇన్ని చోట్ల గెలవగలిగింది. హంగ్ వచ్చిన బీజేపీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వదు.
Also Read: వెనెజువెలా నుంచి రిలయన్స్ చమురు దిగుమతులు.. అమెరికా గ్రీన్‌సిగ్నల్
పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంది. రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తాం. మేము ఎవరికీ మద్దతు ఇవ్వం. మాకు మాత్రం ఎవరైనా సపోర్ట్ ఇస్తే తీసుకుంటామని'' రామచందర్‌రావు స్పష్టం చేశారు.
Follow Us