మోదీ బిగ్ స్కెచ్.. అమరావతికి జగన్ ? | YS Jagan Received Invitation PM Modi Amravati Public Meeting
తెలంగాణ బీజేపీ లీడర్లపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సభ్యత్య నమోదుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని హెచ్చరించింది. ప్రతిఒక్కరి పనితీరుపై నివేదికలు తయారు చేసి, వెనకబడినవారిని సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య పోరు ఉత్కంఠగా మారింది. పోలీసులను డైవర్ట్ చేసేందుకే మావోయిస్టుపార్టీ కర్రె గుట్ట ఆపరేషన్ డ్రామా ఆడినట్లు తెలుస్తోంది. అగ్రనాయకత్వమంతా కేరళ, కర్ణాటక సేఫ్ జోన్లకు వెళ్లిపోయారని, కొంతమంది విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.
తల లేని ప్రధాని మోదీ పోస్ట్ ను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శులు వెలువడడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అంతేకాక బీజేపీ సపోర్టర్లు కూడా కాంగ్రెస్ ను ఈ పోస్ట్ తో ఏకిపారేశారు.
ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నాయకుడు పాకా వెంకటసత్యనారాయణను అధిష్ఠానం ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయ్యింది.
పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతుందంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన జోష్యం చెప్పారు. 2025 చివరి నాటికి పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోతుందన్నారు. POKతో పాటు బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అనే ముక్కలుగా విభజించబడుతుందని అన్నారు.
పార్లమెంట్ చట్టాలపై సుప్రీకోర్టు జోక్యం అవసరం లేదంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె చేసిన వ్యాఖ్యలపై జేపీనడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ప్రకటనలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ పార్టీ అతని అనుచిత వ్యాఖ్యలతో ఏకీభవించట్లేదని స్పష్టం చేశారు.
తమిళనాడు బీజేపీ నేత అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన స్థానంలో అధిష్ఠానం ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేయనుంది. ఇటీవల ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను నుంచి ఆయన తప్పుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో హింసకు మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అల్లర్లు చెలరేగుతుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉండటాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఖండించారు. తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆదునిక జిన్నాతో పోల్చారు.