Karimnagar: బీజేపీకి బిగ్‌ షాక్‌..నిన్న బీజేపీకి జై కొట్టిన  కార్పొరేటర్లు నేడు కాంగ్రెస్‍లోకి జంప్ ?

కరీంనగర్  కార్పొరేషన్‌ మేయర్‌ పీఠాన్ని ఎలాగైన కైవసం చేసుకుంటామని ధీమాతో ఉన్న బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. బీజేపీలో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్ శిభిరంలో చేరారు. వారితో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ కరీంనగర్ పీఠాన్ని దక్కించుకోనుంది.

New Update
FotoJet (12)

Karimnagar Corporation

Karimnagar Corporation : కరీంనగర్  కార్పొరేషన్‌ మేయర్‌ పీఠాన్ని ఎలాగైన కైవసం చేసుకుంటామని ధీమాతో ఉన్న బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కరీంనగర్ పీఠం కమలం ఖాతాలోకి అని ప్రచారం సాగి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్‌ ఆ పార్టీకి షాక్‌ ఇచ్చింది. బీజేపీలో చేరిన స్వతంత్ర అభ్యర్థులను ఆకర్శించేందుకు కాంగ్రెస్‌ ఆఫరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా బీజేపీ 30 సీట్లు, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఏఐఎఫ్‍బీ 2, స్వతంత్రులు 10 మంది గెలుపొందారు. అయితే మేయర్‌ పీఠం దక్కాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 34 కాగా నిన్న కార్పొరేషన్‌లో గెలిచిన ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బీజీపీ గూటికి చేరారు. కేంద్రమంత్రి బండి సంజయ్ వారికి కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇది వరకే మరో ఇద్దరు కార్పొరేటర్లు బీజేపీలో చేరగా.. తాజాగా మరో ఇద్దరు కమలం పార్టీకే జై కొట్టారు. దీంతో కార్పొరేషన్‌లో బీజేపీ బలం 34కు చేరింది.  తాజాగా మరో నలుగురు చేరడంతో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో దాదాపు బీజేపీకే కరీంనగర్ కార్పొరేషన్ వెళ్లనుందన్న ప్రచారం సాగింది. అయితే కాంగ్రెస్‌ దానికి చెక్‌ పెట్టింది.

కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని ఎలాగైన దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ తమ పార్టీ కార్పొరేటర్లను శామీర్ పేట్ లియోనియో రిసార్ట్ తరలించింది. అయితే మొన్న బీజేపీకి మద్దతు ఇచ్చిన నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లలో ఇద్దరిని  కాంగ్రెస్‌ తమవైపు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ అయినట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంపులోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 15వ డివిజన్ నుంచి  ఏఐఎఫ్‍బీ కార్పొరేటర్ గా విజయం సాధించిన సాయిజ్యోతి ఫలితాల తర్వాత ఆమె బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే ఆమెను కాంగ్రెస్‌ పార్టీ తమవైపు తిప్పుకోవడంతో ఆమె కాంగ్రెస్‌ క్యాంపులో చేరినట్లు తెలుస్తోంది.దీంతో ఆమె ఇంటిముందు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సాయిజ్యోతి డబ్బులకు అమ్ముడు పోయి మాట మార్చారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆమె కాంగ్రెస్ క్యాంపునకు వెళ్లారంటూ ఆరోపించడంతో   ఆమె ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అయితే దీనిపై స్పందించిన సాయిజ్యోతి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ నెల 16న జరిగే మేయర్ ఎన్నికల్లో నాకు నచ్చిన వారికి ఓటు వేసుకుంటానని చెప్పారు. నా పిల్లలకు ఆరోగ్యం బాగా లేక నేను వేరే ఊరు వెళ్తున్నానని నా ఇంటి వద్ద ఆందోళన చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ ఆమె వీడియో రిలీజ్ చేయడం చర్చనీయంశంగా మారింది.  

ఇప్పటి వరకు ఉన్న లెక్కలు బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ వేస్తున్న వ్యూహంతో సమీకరణాలు తారుమారు కాబోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ  బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. కరీంనగర్‌లో బీజేపీని నిలువరించేందుకు బీఆర్‌ఎస్‌ అవసరమైతే  కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే గులాబీ పార్టీ ముఖ్యనేతలతో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరపగా ఈ మేరకు బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కరీంనగర్ అభివృద్ధి కోసం మద్దతు ఇస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ప్రకటించారు.  దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లతో పాటు బీజేపీకి చెందిన మరికొంత మంది కార్పొరేటర్ల సహకారంతో మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే బీఆర్ఎస్ మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. 


ఇక ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడా బీజేపీకి మేయర్ పీఠం దక్కలేదు. తొలిసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్‌లో జెండా పాతుదామని ఆశించిన కమలనాథులకు కాంగ్రెస్ వేసిన ఎత్తుగడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మరోవైపు బీఆర్ఎస్‌ కు కూడా ఎక్కడ మేయర్‌ పీఠం దక్కలేదు.దీంతో ఇలాగైన తమకు మేయర్‌ లేదా డిప్యూటీ మేయర్‌ దక్కుతాయని భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు