Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొత్త ముప్పు.. ఏకంగా 5 మేడే కాల్స్!
ప్రపంచ విమానశ్రయాల్లో మేటి విమానాశ్రయంగా పేరున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షులతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది మొదలు నుంచి మే నెల చివరివరకు కేవలం ఐదు నెలల కాలంలో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో పక్షులు ఢీ కొన్న ఘటనలు కలకలం రేపాయి.