Mosquito: ల్యాబ్‌లో దోమల తయారీ.. ఎందుకో తెలిస్తే షాక్!

హవాయిలో తయారు చేసి ఈ దోమలు మనుషులను కుట్టవు. అవి స్పెషల్‌గా ల్యాబ్‌లో తయారు చేసిన మగ దోమలు. ఈ దోమల లోపల ఒక బ్యాక్టీరియా ఉంది. అది ఆడ దోమలతో సంభోగం తర్వాత కూడా గుడ్లు పొదగనివ్వదు. అసలు హవాయి ప్రభుత్వం ఈ దోమలను ఎందుకు తయారు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

New Update
Mosquitoes in Hawaii

హవాయి దీవుల్లోని దట్టమైన అడవుల్లో డ్రోన్లతో దోమల్ని వదులుతున్నారు. జూన్‌లో ఆ దేశ ప్రభుత్వం ఇది చేసింది. డ్రోన్ల ద్వారా ఆకాశం నుంచి చిన్న బయోడిగ్రేడబుల్ పాడ్‌లను జారవిడిచారు. ప్రతి పాడ్‌లో దాదాపు 1,000 దోమలు ఉండేవి. కానీ ఈ దోమలు మనుషులను కుట్టవు. అవి స్పెషల్‌గా ల్యాబ్‌లో తయారు చేసిన మగ దోమలు. ఈ దోమల లోపల ఒక బ్యాక్టీరియా ఉంది. అది ఆడ దోమలతో సంభోగం తర్వాత కూడా గుడ్లు పొదగనివ్వదు. అసలు హవాయి ప్రభుత్వం ఈ దోమలను ఎందుకు తయారు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

అంతరించిపోతున్న పక్షులు

హవాయిలోని అంతరించిపోతున్న పక్షులను రక్షించడానికి దోమలను తయారు చేశారు. ఆ దేశంలో హనీక్రీపర్ వంటి అందమైన, రంగురంగుల పక్షులు ఎక్కువగా కనిపించేవి. కానీ ప్రస్తుతం వాటి సంఖ్య స్పీడ్‌గా తగ్గుతోంది. గతంలో 50 కంటే ఎక్కువ జాతుల హనీక్రీపర్లు ఉండేవి, కానీ ఇప్పుడు 17 మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిలో చాలా వరకు అంతరించిపోతున్నాయి. ఈ పక్షులు పర్యావరణంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. అవి పువ్వుల పుప్పొడిని వ్యాపింపజేస్తాయి. విత్తనాలను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్తాయి. గత సంవత్సరం అకికికి అనే చిన్న పక్షి హవాయి అడవుల్లో దాదాపుగా అంతరించిపోయింది. ఇప్పుడు అకేకే అనే మరొక జాతికి చెందిన 100 కంటే తక్కువ పక్షులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటి మరణం పర్యావరణానికి మాత్రమే కాకుండా హవాయి సాంస్కృతిక గుర్తింపుకు కూడా పెద్ద నష్టం.

కారణం దోమలు, మలేరియా

ఈ పక్షులు అంతరించిపోడానికి కారణం ఏవియన్ మలేరియా. అంటే పక్షులను ప్రభావితం చేసే మలేరియా. ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. వాస్తవానికి, అంతకుముందు హవాయిలో దోమలు లేవు. 1826 లో తిమింగలాలు పట్టే ఓడలు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు, దోమలు కూడా వాటితో పాటు వచ్చాయి. అప్పటి నుంచి ఈ దోమలు అక్కడి వాతావరణంలో వ్యాపించి పక్షులకు ముప్పుగా మారాయి. ఎందుకంటే అక్కడి పక్షులకు దోమల కారణంగా వచ్చే వ్యాధితో పోరాడే శక్తి లేదు. గతంలో పక్షులు దోమల నుండి తప్పించుకోవడానికి పర్వతాల ఎత్తులకు వెళ్ళేవి, చలి కారణంగా దోమలు అక్కడికి ప్రయాణించేవి కావు. కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎత్తైన పర్వతాలపై కూడా ఉష్ణోగ్రత పెరుగుతోంది. దోమలు అక్కడికి వెళ్లగలుగుతున్నాయి.

ల్యాబ్‌లో దోమల తయారీ

పక్షులను కాపాడటానికి శాస్త్రవేత్తలు IIT అనే సాంకేతికతపై పని చేయడం ప్రారంభించారు. ఇన్‌కాంపాటబుల్ ఇన్‌సెక్ట్ టెక్నిక్‌తో మగ దోమల లోపల ఒక బ్యాక్టీరియా (వోల్బాచియా) ప్రవేశపెడతారు. ఈ దోమలు అడవిలో ఆడ దోమలతో జతకట్టినప్పుడు, వాటి గుడ్లు పొదుగవు. దీంతో  దోమల సంఖ్య క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. 2016లో అమెరికన్ బర్డ్ కన్జర్వెన్సీ, బర్డ్స్ అండ్ నాట్ మస్కిటోస్ అనే సంస్థలు ఈ సాంకేతికతపై పరిశోధనలు ప్రారంభించాయి. కాలిఫోర్నియాలోని ఒక ప్రయోగశాలలో లక్షలాది దోమలను తయారు చేసి, ఆపై వాటిని హవాయిలోని మౌయి, కౌయి దీవులలో విడుదల చేశారు . ప్రతి వారం సుమారు 1 మిలియన్ దోమలను విడుదల చేస్తున్నారు.

డ్రోన్ గేమ్ ఛేంజర్‌గా మారింది. కొండ ప్రాంతాలు, దట్టమైన అడవుల్లో హెలికాప్టర్ల నుంచి దోమలను విడుదల చేయడం ఖరీదైనది, కష్టం. అందుకే ఇప్పుడు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి చౌకైనది, సురక్షితమైనది. వాతావరణానికి అనుగుణంగా మరింత సులభం. హెలికాప్టర్లు చేరుకోలేని ప్రదేశాలలో కూడా దోమలను డ్రోన్‌ల ద్వారా విడుదల చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు