భూమ్మీద చాలా రకాలైన విచిత్రమైన జంతువులున్నాయి. వాటిలో చాలా వరకు ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవి. అయితే చాలా మందికి పాములు, తేళ్లు, కప్పల గురించి మాత్రమే తెలుసు. పాము విషం ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. ఏకంగా ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతాయి. అలాగే కొన్ని తేళ్లు కూడా అత్యంత విషపూరితంగా ఉంటాయి. ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు తన తోక చివరి ముల్లుతో ఒక్క గాటు పెట్టిందంటే విలవిల్లాడిపోవాల్సిందే. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. అలాగే విషపూరితమైన కప్పలు కూడా ఉన్నాయి. ఇలా చాలా వరకు విషపూరితమైనవని అందరికీ తెలిసిందే. కానీ పక్షులు కూడా విషపూరితంగా ఉంటాయని మీలో ఎవరికైనా తెలుసా?. ఆ పక్షులు కరిచినా లేదా పక్షులను మనం పట్టుకున్నా చాలా డేంజర్. ఏకంగా ప్రాణాలే పోయే పరిస్తితి వస్తుంది. అవును మీరు విన్నది నిజమే. అలాంటి పక్షుల భూమ్మీదే ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా చూడండి: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ హుడెడ్ పిటోహుయ్ హుడెడ్ పిటోహుయ్ అత్యంత విషపూరితమైన పక్షుల్లో ఒకటి. ఇది న్యూ గినియాకు చెందిన పక్షి. ఈ పక్షి చాలా అందంగా ఉంటుంది. అయినప్పటికీ ఇది చాలా డేంజర్ అని కూడా చెప్పబడింది. దీని చర్మం, ఈకలలో బాట్రాచోటాక్సిన్ అని పిలిచే న్యూరోటాక్సిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పక్షిని తాకితే తీవ్రమైన మంట పుడుతుంది. అలాగే దీన్ని తాకితే చేతుల్లో తిమ్మిరి, జలదరింపును అనుభవించవచ్చు. బ్లూ-క్యాప్డ్ ఇఫ్రిటి ఇది కూడా చూడండి: బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు బ్లూ-క్యాప్డ్ ఇఫ్రిటి అనే పక్షి కూడా న్యూగినియా ప్రాంతంలో ఉన్న మరో విషపూరితమైన పక్షి. ఈ పక్షి విషపూరితమైన కీటకాలను తినడం ద్వారా దాని చర్మం, ఈకలు విషపూరితంగా మారుతాయి. ఈ పక్షిని తాకినట్లయితే దురద, మంట, తిమ్మిరి వంటి చర్మపు చికాకును అనుభవిస్తారు. ఇది కొన్ని గంటలపాటు ఉంటుంది. యూరోపియన్ క్వాయిల్ యూరోపియన్ క్వాయిల్.. దీనిని కామన్ క్వాయిల్ అని కూడా పిలుస్తారు. ఇవి ఆఫ్రికా, ఐరోపా, ఆసియాలోని దక్షిణ ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇవి అత్యంత విషపూరితమైనవి. ఈ పక్షలు తమ ఆహారంలో అత్యంత ప్రమాదకరమైన మొక్కలను సైతం తింటాయి. అందువల్లనే వీటి శరీరం విషపూరితంగా ఉంటుంది. దీన్ని తింటే కండరాల సున్నితత్వం, అంత్య భాగాల నొప్పి, వికారం, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం కూడా వచ్చే అవకాశం ఉంది. రఫ్ గ్రౌస్ ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ యునైటెడ్ స్టేట్స్‌లో రఫ్ గ్రౌస్‌ను అప్పట్లో వేటాడి తినేవారు. అనంతరం రోగాల బారిన పడేవారు. దీనిని తిన్న 30 - 40 నిమిషాల్లో లక్షణాలు మొదలవుతాయి. తల తిరగడం, వాంతులు, వికారం, పక్షవాతం, తిమ్మిరి, దృష్టి లోపం సహా మరిన్ని లక్షణాలు దీన్ని తింటే వస్తాయి. అయితే కొందరు మరణించే అవకాశం కూడా ఉందని తెలిసింది. రెడ్ వార్బలర్ రెడ్ వార్బలర్ అనే పక్షి చాలా ప్రమాదకరం. ఇది మెక్సికోలో ఉంటుంది. దీనికి ఉండే రెక్కలే అత్యంత ప్రమాదకరం. చూడ్డానికి మిలమిల మెరిసిపోతుంది. ఇవి మాత్రమే కాకుండా వీటితో పాటు మరెన్నో పక్షులు విషపూరితమైనవిగా ఉన్నాయి.