Earthquake: మయన్మార్‌లో మరోసారి భూకంపం !
మయన్మార్‌లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మయన్మార్, థాయ్‌లాండ్‌లో శుక్రవారం సంభవించిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.