Earthquake: ఎత్తైన భవనం కూలిన ఘటనలో 90మంది మిస్సింగ్ ..

బ్యాంకాక్‌లో భూకంపం సంభవించడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఎత్తైన భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు థాయ్‌లాండ్ రక్షణశాఖ మంత్రి వెల్లడించారు. మరో 90 గల్లంతయినట్లు పేర్కొన్నారు.

New Update
Earthquake in Bangkok

Earthquake in Bangkok

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంపం సంభవించడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భూ ప్రకంపనల దాటికి అనేక భవనాలు ఊగిపోయాయాయి. పలు భవనాలు కూలిపోయాయి. అయితే నిర్మాణంలో ఉన్న ఓ ఎత్తైన భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు థాయ్‌లాండ్ రక్షణశాఖ మంత్రి వెల్లడించారు. మరో 90 గల్లంతయినట్లు పేర్కొన్నారు. 

Also Read: మందు బాబుల గుండెలు పిండేసే వార్త.. ఏమిటో తెలిస్తే తట్టుకోలేరు!

ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది ఏడుగురిని రక్షించినట్లు తెలిపారు. దీనిపై మరిన్న వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. శుక్రవారం బ్యాంకాక్‌లో 7.7 తీవ్రతో భూకంపం సంభవించింది. భవనాలు ఊగిపోవడం, మరికొన్ని కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఓ భారీ భవనంలో పైఅంతస్తులోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్న నీరు కింద పడిపోయిన దృశ్యాలు బయటకు వచ్చాయి. మరోవైపు థాయ్‌లాండ్ ప్రధాని షినవత్ర బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అలాగే అక్కడ మెట్రో, రైలు సేవలు కూడా నిలిపివేశారు. 

Also Read: త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌పై టీవీకే పార్టీ సంచలన నిర్ణయం

సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా సిటీకి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 12 నిమిషాల వ్యవధిలోని మయన్మార్‌లో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.7గా నమోదైంది. దీని ప్రభావంతోనే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  బ్యాంకాక్‌లో భూ ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. భూకంప ప్రభావంతో వందలాది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 15 మృతదేహాలు లభ్యమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

telugu-news | Earthquake in Bangkok

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు