Earthquake: మయన్మార్‌లో మరోసారి భూకంపం !

మయన్మార్‌లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో శుక్రవారం సంభవించిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.

New Update
Earthquake in Myanmar

Earthquake in Myanmar

మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో శుక్రవారం సంభవించిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మయన్మార్‌లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. యూనైటెడ్ స్టేట్స్‌ జియోలాజికల్ సర్వే ఈ భకంప తీవ్రతను 5.1గా పేర్కొంది. మయన్మార్ రాజధాని నేపిడాకి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. 

Also Read: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ

ఇదిలాఉండగా.. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 నిమిషాల వ్యవధిలో  అక్కడ 7.7, 6.4 తీవ్రతతో రెండుసార్లు భూకంపం వచ్చింది. అనేక భవనాలు ఊగిపోయాయి. మరికొన్ని నెలకొన్నాయి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల్లో భూకంపం ధాటికి ఇప్పటిదాకా 1000 మందికి పైగా మృతి చెందారు. 

Also Read: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి

మరోవైపు మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాల ముందుకొస్తున్నాయి. ఇప్పటికే భారత్‌.. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, టెంట్లు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసింది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా సాయం చేస్తామని ప్రకటించాయి. అలాగే మయన్మార్, థాయ్‌లాండ్‌కు సహాయక సామగ్రిని  పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియోగుటెరస్ తెలిపారు. 

 telugu-news | rtv-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు