Earthquake: ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఉండగా భూకంపం.. చివరికి

బ్యాంకాక్‌లో భూకంపం వచ్చిన సమయంలో ఓ అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు ఓ పార్క్‌లోనే డెలివరీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

New Update
Earthquake in Bangkok

Earthquake in Bangkok

మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో శుక్రవారం భారీ భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ తీవ్ర విషాద ఘటనలో ఇప్పటిదాకా 1000 మందికి పైగా మృతి చెందారు. అయితే భూ ప్రకంపనల సమయంలో బ్యాంకాక్‌లో జరిగిన ఓ అనూహ్య ఘటన బయటపడింది. భూకంపం వచ్చిన సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో ఆ మహిళకు వైద్యులు ఓ పార్క్‌లోనే డెలివరీ  చేశారు. ప్రస్తుతం  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.     

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన సీఐడీ

ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం.. భూ ప్రకంపనలు వచ్చిన సమయంలో బీఎన్‌హెచ్, కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ ఆస్పత్రుల్లో రోగులను వైద్య సిబ్బంది దగ్గర్లోని పార్కుకి తరలించారు.  ఈ క్రమంలోనే ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను స్ట్రెచర్‌పైకి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత పార్క్ వద్దే డెలవరీ చేశారు. పార్క్‌లోనే మిగతా రోగులకు కూడా వైద్య సదుపాయాలు అందించారు. 

ఇదిలాఉండగా.. మయన్మార్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భూకంపం వల్ల మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ పెను విషాద ఘటనల్లో ఇరు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య వెయ్యి దాటం ఆందోళన కలిగిస్తోంది. మరో 2, 370 మంది గాయాలపాలయ్యారు. అంతేకాదు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా 4.2 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాల ముందుకొస్తున్నాయి.

Also Read: మరో మయన్మార్‌ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!

 ఇప్పటికే భారత్‌.. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, టెంట్లు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసింది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా సాయం చేస్తామని ప్రకటించాయి. అలాగే మయన్మార్, థాయ్‌లాండ్‌కు సహాయక సామగ్రిని  పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియోగుటెరస్ తెలిపారు.  

telugu-news | rtv-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు