Bangkok: థాయ్‌లో ఫెర్రీ ప్రమాదం. స్పాట్ లో 100 మంది ..

థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కోహ్‌ కూద్‌ నుంచి ట్రాట్‌ ప్రావిన్స్‌లోని ప్రధాన భూభాగం వైపు ప్రయాణిస్తున్న ఫెర్రీ ప్రమాదంలో చిక్కుకుంది. విషయం తెలిసిన వెంటనే సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగం పడవల ద్వారా 100 మందిని సురక్షితంగా రక్షించారు.

New Update
FotoJet - 2025-11-21T082433.362

Ferry accident in Thailand. 100 people on the spot..

Bangkok : థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక(tourism) ప్రాంతమైన కోహ్‌ కూద్‌ నుంచి ట్రాట్‌ ప్రావిన్స్‌లోని ప్రధాన భూభాగం వైపు ప్రయాణిస్తున్న ఫెర్రీ ప్రమాదం(Ferry Boat)లో చిక్కుకుంది. విషయం తెలిసిన వెంటనే సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగం పడవల ద్వారా సిబ్బంది సహా మొత్తం 100 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో, పెనుప్రమాదం తప్పినట్లయిందని అధికారులు తెలిపారు. ప్రైవేట్‌ సంస్థకు చెందిన ఈ ఫెర్రీ గురువారం పర్యాటక ప్రాంతమైన కోహ్‌ కూద్‌ నుంచి ట్రాట్‌ నగరం వైపు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.

Also Read :  యూకేలో స్థిరపడాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. పదేళ్ళు ఉంటేనే గానీ..

Ferry Accident In Thailand

కోహ్‌ కూద్‌ నుంచి ట్రాట్‌ ప్రావిన్స్‌లోని ప్రధాన భూభాగం దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉంది. కాగా ఫెర్రీ మధ్యలోకి వచ్చేసరికి రంధ్రం పడి లోపలికి నీరు చేరడం మొదలైంది. మరోవైపు సముద్రంలో భారీ అలలు ఎగసి పడుతుండటంతో అప్రమత్తమైన సిబ్బంది ఫెర్రీకి లంగరేసి అధికారులకు ప్రమాద సందేశాన్ని అందజేశారు. సమాచారమందుకున్న ఇతర ఫెర్రీల నిర్వాహకులు, సమీప బోట్లలోని మత్స్యకారులతోపాటు నేవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గంట వ్యవధిలోనే ఫెర్రీలో ఉన్న 97 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించి వారిని తీర ప్రాంతానికి తరలించారు. అనంతరం ఫెర్రీలోని నీటిని తోడివేసి, తీరానికి తీసుకెళ్లారు.

Also Read :  పాకిస్థాన్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Advertisment
తాజా కథనాలు