/rtv/media/media_files/2025/09/25/shocking-scene-a-50-meter-hole-2025-09-25-08-10-21.jpg)
Bangkok sinkhole
థాయ్‌లాండ్(thailand) రాజధాని బ్యాంకాక్(Bangkok) లో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం అందరినీ షాక్‌కు గురి చేసింది. రద్దీగా ఉండే ఒక రోడ్డు అమాంతం కుంగిపోవడం కలకలం రేపింది. ఓ రహదారిపై బుధవారం ఉన్నట్టుండి భారీ గొయ్యి ఏర్పడింది. 50 మీటర్ల లోతున భారీ గొయ్యి పడింది. బ్యాంకాక్‌లోని వజీరా హాస్పిటల్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం అందర్నీ కలవరానికి గురిచేసింది. దీంతో ఆ ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది కూడా చూడండి: Zubeen Garg funeral: అస్సామీ సింగర్ అంత్యక్రియలకు ప్రపంచ రికార్డ్
Road Collapse In Bangkok
వివరాల ప్రకారం..బ్యాంకాక్‌లో బుధవారం ఉదయం సమ్సెన్ రోడ్డులోని వజీరా ఆస్పత్రి సమీపంలో ఉన్న ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయిది. ప్రధాన రోడ్డు 50 మీటర్ల లోతుకు కూరుకుపోయింది. విద్యుత్ స్తంభాలు కూలిపోయి, కరెంటు తీగలు గాల్లో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. నీటి పైపులైన్లు పగిలిపోయి పెద్ద ఎత్తున నీరు నిండిపోయింది. ఈ ప్రమాదం వల్ల సమీపంలోని భవనాలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో జరుగుతున్న భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల కారణంగానే భారీ గొయ్యి ఏర్పడి ఉంటుందని బ్యాంకాక్ గవర్నర్ చాడ్‌చార్ట్ సిట్టిపాంట్ స్పష్టం చేశారు.
Dramatic moment in Bangkok: road suddenly collapsed into a giant sinkhole, swallowing a car & an electric pole into a 50m-deep hole
— RT (@RT_com) September 24, 2025
The sinkhole continues to widen as people run for their safety pic.twitter.com/uAIFigxrvj
ఆ ఘటనకు సంబంధించిన వీడియోప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, మూడు వాహనాలు మాత్రం ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఘటన జరిగిన హాస్పిటల్ నుంచి రోగులను, సమీప అపార్ట్‌మెంట్ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. చుట్టుపక్కల నిర్మాణాలు, భవనాలకు ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో అధికారులు ఆ ప్రాంతాన్ని ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. ఒక పోలీస్‌స్టేషన్‌ను, ఆస్పత్రి ఔట్‌పేషెంట్ వార్డును మూసివేశారు. విద్యుత్, నీటి సరఫరాను ఆపారు. రోడ్డుపై పేద్ద సింక్‌హోల్ ఏర్పడటంతో మూడు వాహనాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
కాగా రోడ్డు నెమ్మదిగా కుంగిపోతుండటం, ఒరిగిపోతున్న విద్యుత్ స్తంభాలు, పగిలిపోతున్న నీళ్ల పైపు లైన్లు, గుంత పెద్దదైన కొద్దీ కార్లు, తదితర వాహనాలు వెనక్కి మళ్లడం, పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం వంటి వీడియోలు ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. గుంత పడిన ఒక అంచు సరిగ్గా పోలీస్ స్టేషన్ ఎదుట ఆగిపోయింది. భూగర్భ నిర్మాణం ఆ వీడియోలో కనిపిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నందున గుంత మరింత విస్తరించకుండా సాధ్యమైనంత త్వరగా పూడ్చివేసే చర్యలకు యంత్రాంగం ఉపక్రమించింది.