PM Modi: బ్యాంకాక్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఎందుకెళ్లారంటే ?

ప్రధాని మోదీ గురువారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు చేరుకున్నారు. బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.

New Update
PM Modi in Bangkok

PM Modi in Bangkok

ప్రధాని మోదీ గురువారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు చేరుకున్నారు. బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయనకు ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా.. “ది వరల్డ్ టిపిటక: సజ్ఝాయ ఫొనెటిక్ ఎడిషన్”ను మోదీకి ప్రదానం చేశారు. టిపిటక అనేది 108 సంపుటాలతో కూడిన బుద్ధుడి బోధనల సంకలనం. దీన్ని ప్రధాన బౌద్ధ గ్రంథంగా కూడా పరిగణిస్తారు.  

Also Read: విదేశాలపై ట్రంప్‌ టారీఫ్‌.. అమెరికాకు మాంద్యం తప్పందంటున్న పెట్టుబడిదారులు !

ఇదిలాఉండగా ఈ పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్ ప్రధానితో సంప్రదింపులు జరపనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. అలాగే దక్షిణాసియా, ఆగ్నేసియా ప్రాంతాలకు చెందిన బిమ్‌స్టెక్ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో భారత్‌తోపాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్‌ దేశాల అధినేతలు పాల్గొననున్నారు.

Also Read: తల్లికి, బిడ్డకు ఒకేసారి కడుపు చేసిన యూట్యూబర్.. నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రచ్చ రచ్చ!

బ్యాంకాక్‌ పర్యటనలో భాగంగా మోదీ పదవ 'రామ'గా ప్రసిద్ధుడైన థాయ్‌లాండ్ మహారాజు వజిరలాంగ్‌ కోమ్‌ను కూడా కలవనున్నారు. ఇదిలాఉండగా ఇటీవల మయన్మార్‌లో సంభవించిన భూకంపం బ్యాంకాక్‌లో తీవ్ర ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే.  ఈ భూ ప్రళయంలో ఇప్పటిదాకా 3 వేల మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగడం ఆందోళన కలిగిస్తోంది . 

Advertisment
తాజా కథనాలు