Assam Encounter : మావోయిస్టులకు ఎదురుదెబ్బ..కీలక నేత ఎన్ కౌంటర్

ఒకవైపు మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాట పడుతుంటే మరోవైపు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. అసోం లోని కోక్రాఝార్ జిల్లాలో శనివారం ఓ ఎన్‌కౌంటర్  చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత ఒకరు మృతిచెందారు.

New Update
Maoist leader Ipil Murmu alias Rohit Murmu

Maoist leader Ipil Murmu alias Rohit Murmu Encounter

Assam Encounter: ఒకవైపు మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాట పడుతుంటే మరోవైపు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. అసోం లోని కోక్రాఝార్ జిల్లాలో శనివారం ఓ ఎన్‌కౌంటర్  చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత ఒకరు మృతిచెందారు. చనిపోయిన మావోయిస్టునేతను కోక్రాఝార్ కు చెందిన రోహిత్ ముర్ము గా గుర్తించారు. ఈనెల 23న కోక్రాఝార్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ను ఐఈడీతో పేల్చేసిన ఘటనలో రోహిత్ ముర్ము కీలక నిందితుడని పోలీసులు అంటున్నారు. గత ఏడాది జార్ఖాండ్‌లో ఇదే తరహా పేలుడు ఘటనలోనూ రోహిత్‌ నిందితుడని వెల్లడించారు. ఘటనా స్థలిలో ఒక పిస్తోలు, గ్రనేడ్, వోటర్ ఐడీ కార్డు, జార్ఖాండ్ సర్కార్ జారీ చేసిన ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 కాగా గత ఏడాది జార్ఖాండ్‌లో ర్వైలే ట్రాక్‌ను పేల్చివేసిన రోహిత్ ముర్ము  ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి అసోంకు వచ్చినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) పుష్పరాజ్ సింగ్ వివరించారు. జార్ఖాండ్‌లో రోహిత్‌ను  రోహిత్ వర్మ అని పిలిచేవారని, అసోంలో ఐపిల్ ముర్ముగా అతను చెప్పుకునేవాడని ఆయన వివరించారు. మావోయిస్టుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న రోహిత్‌ మరోవైపు ప్రస్తుతం అచేతనంగా ఉన్న నేషనల్ సంతాల్ లిబరేషన్ ఆర్మీ (ఎన్ఎస్ఎల్ఏ)తోనూ ముర్ము సంబంధాలు నెరపుతున్నట్టు విచారణలో తేలిందన్నారు.

ఎన్ఎస్ఎల్ఏ దళాలు ఆయుధాలు విడిచి లొంగిపోగా, ముర్ము లొంగిపోయేందుకు ఇష్టపడలేదన్నారు. ఆ తర్వాత జార్ఖాండ్‌కు పారిపోయిన రోహిత్‌ అక్కడ చీలిక గ్రూపును ఏర్పాటు చేసి దానికి కమాండర్ అయినట్టు తెలిపారు. క్రమంగా మావోయిస్టు గ్రూపులతో సంబంధాలు పెట్టుకుని తన నెట్‌వర్క్‌ను విస్తరించాడని, 2015 నుంచి జార్ఖాండ్‌లో విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతూ వచ్చాడని పోలీసులు వెల్లడించారు. రోహిత్ ముర్ము జాడను తెలుసుకునేందుకు జార్ఖాండ్ పోలీసు బృందం ఇటీవల అసోం వచ్చింది. స్థానిక అధికారుల సమన్వయంతో గాలింపు జరుపుతుండగా తాజా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు