రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసిన సీఎం..

కాంగ్రెస్ నేతలు.. సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబీకులు 1200 బిఘాల భూమి(దాదాపు 750 ఎకరాలు)ని ఆక్రమించారంటూ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసినట్లు సీఎం పేర్కొన్నారు.

New Update
Assam CM Himanta Biswa Sarma

Assam CM Himanta Biswa Sarma

ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండంటంతో అధికార, విపక్ష నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి కాంగ్రెస్ నేతలు.. సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబీకులు 1200 బిఘాల భూమి(దాదాపు 750 ఎకరాలు)ని ఆక్రమించారంటూ ఆరోపించారు. దీనిపై స్పందించిన సీఎం.. తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలపై పరువునష్టం దావా వేసినట్లు పేర్కొన్నారు. 

Also Read: సోషల్ మీడియా సంస్థలకు షాక్.. ఏఐ కంటెంట్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

ఇటీవల కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్‌లో తనపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని మండిపడ్డారు. జితేంద్ర సింగ్, గౌరవ్‌ గొగొయ్‌, భూపేంద్ర సింగ్‌ బఘేల్‌ నుంచి రూ.500 కోట్ల పరిహారం కోరుతూ దావా వేశానని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ నేత గొగోయ్‌ అంతకుముందు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గంపై సీఎం హిమంత బిశ్వ శర్మ విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు బీజేపీ నేతలపై గువాహటిలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Also Read: ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్

Advertisment
తాజా కథనాలు