/rtv/media/media_files/2026/02/15/underwater-road-rail-tunnel-2026-02-15-16-11-41.jpg)
India To Build Its 1st Underwater Road-Rail Tunnel At Rs 18,000 Crore
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలి రోడ్డు-రైలు సొరంగం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అస్సాంలోని గోహ్‌పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ను నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.18,662 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించనుంది. ఇందులో భాగంగానే బ్రహ్మపుత్ర నది కింద రోడ్డు-రైలు సొరంగ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం NH-715లోని నుమాలిఘర్, NH-15లోని గోహ్‌పూర్ మధ్య 240 కిలోమీటర్ల దూరం ఉంది.
Also Read: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్.. ఇండియా ప్రధాని మోదీకి ఆహ్వానం
అయితే ఇది NH-52లోని సిల్‌ఘాట్ సమీపంలోని కాలియాభంభోరా మీదుగా వెళ్తుంది. నుమాలీగఢ్, కాజిరంగ నేషనల్ పార్క్, బిస్వనాథ్ టౌన్ లాంటి ప్రాంతాల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. ఇక కొత్త గ్రీన్‌ఫీల్డ్ కారిడర్ నిర్మాణం వల్ల ప్రయాణ సమయం చాలావరకు తగ్గుతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్స్ట్రక్షన్ (EPC) మోడల్ ద్వారా దీన్ని అభివృద్ధి చేయనున్నారు.
Also Read: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్.. ఇండియా ప్రధాని మోదీకి ఆహ్వానం
బహ్మపుత్ర నది కింద నిర్మించనున్న రోడ్డు-రైలు టన్నెల్ ద్వారా అస్సాం మాత్రమే కాక అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, ఈశాన్య రాష్ట్రాలకు సైతం ప్రయోజనం కలగనుంది. ఈ కారిడార్ అనేది 11 ఆర్థిక కేంద్రాలు, మూడు సామాజిక కేంద్రాలు, రెండు పర్యాటక కేంద్రాలు, ఎనిమిది లాజిస్టిక్ కేంద్రాలకు అనుసంధానంగా ఉండనుంది. అలాగే నాలుగు రైల్వే స్టేషన్లు, రెండు ఎయిర్‌పోర్టులు, రెండు అంతర్గత జలమార్గాలతో కూడిన మల్డీ మోడల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయనుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఎంతగానో ఉపయోగపడనుంది.
Follow Us