BIG BREAKING: పోసానికి బెయిల్
కడప కోర్టులో పోసాని కృష్టమురళికి ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆ కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.
కడప కోర్టులో పోసాని కృష్టమురళికి ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆ కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ ముఠాను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలు సరిచేస్తామంటూ విదేశీయులను బురిడీ కొట్టిస్తున్న 60మందిని గుర్తించారు. హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరిట దందా చేస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాల 40 ఏళ్ల నాటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. 40 సంవత్సరాల క్రితం ఓ భూ వివాదంలో తన పొరుగువారిని హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు మధ్యప్రదేశ్లోని దట్టమైన అడవుల్లో సాధువు వేషంలో అరెస్టు చేశారు.
వైసీపీ హయాంలో ఏపీఎఫ్టీవీడీసీ ఛైర్మన్ గా ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళిని నిన్న ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని మై హోమ్ భూజాలో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్ళిన పోలీసులు గందరగోళం చేశారని ఆయన భార్య చెబుతున్నారు. అన్నం కూడా తిననివ్వలేదని వాపోయారు.
నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కులాల పేరుతో దూషించడం.. ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై కేసు నమోదు చేశారు. రాజంపేట అడ్మినిస్ట్రేషన్ ఎదుట పోసానిని పోలీసులు హాజరుపర్చనున్నారు.
సోషల్ మీడియాలో బెట్టింగ్ పై రిల్స్ చేస్తూ అడ్డంగా బుక్కైన లోకల్ బాయ్ నానిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై పలు సెక్షన్ల కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు నాని ని రిమాండ్ కు తరలించారు.
కిడ్నాప్, దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రాయదుర్గంలో వంశీ నివసిస్తున్న ఇంటి వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజీని తీసుకున్నారు.
నగదు అక్రమ రవాణా కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద జగన్నాథ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన భార్యను కూడా అరెస్ట్ చేశారు.ఆమెను తరువాత విడిచిపెట్టారు. కానీ ప్రవింద మాత్రం ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.
ఏపీ అన్నమయ్య జిల్లా యాసిడ్ దాడి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రేమపేరుతో పార్వంపల్లి గౌతమిపై యాసిడ్ దాడికి పాల్పడి పారిపోయిన గణేష్ ను 15 నిమిషాల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆరాతీశారు.