/rtv/media/media_files/2025/04/26/K1CLLc7akC19DaDvl1e4.jpg)
SAJJALA SREEDHAR REDDY
AP liquor scam : వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో శ్రీధర్ రెడ్డి ఏ6గా ఉన్నారు. ఆయనను కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా.. కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యహించినట్లుగా సీట్ గుర్తించింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి (ఏ1), ఆయన తోడల్లుడు చాణక్య (ఏ8)ను అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని ప్రతినెలా రూ.60 కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్‌తో కలిసి శ్రీధర్‌రెడ్డి కూడా కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేసులో శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
శ్రీధర్ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి, వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి వందల కోట్లు వెనకేసుకున్నట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు... శుక్రవారం సాయంత్రం శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి. విజయవాడకు తీసుకొచ్చారు. శనివారం ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు.
Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్‌రెడ్డి పాత్ర గురించి చాణక్య రిమాండ్ రిపోర్టులోనే ‘సిట్’ క్లుప్తంగా వివరించింది. దీని ప్రకారం... 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్ యజమానులను రప్పించారు. లిక్కర్ సరఫరా చేయాలంటే కనీసం 12శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు.
Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్ పలుమార్లు చర్చలు జరిపారు. కమీషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు వెళ్లాయి. అలాగే అప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీస్‌ను బలవంతంగా లాక్కుని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. శ్రీధర్‌రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ్‌లో మిథున్‌రెడ్డికి వాటా వచ్చేలా ప్లాన్ చేశారు. వైసీపీ హయాంలో మద్యం దుకాణాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న సదరన్ బ్లూ, నైన్ హార్స్ వంటివి వీరి ఉత్పత్తులే కావడం గమనార్హం.
Also Read : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!