/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాసును మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న పూజలు పేరుతో మహిళ నుండి రూ.10 లక్షలు వసూలు చేసిన కేేసులో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. లేడీ అఘోరీతోపాటు అతన్ని పెళ్లి చేసుకున్న శ్రీవర్షణిని కూడా హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో వారిని మోకిలా పోలీసులు పట్టుకున్నారు.
Also read: మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ లేడీ అఘోరీ శివ విష్ణు బ్రహ్మ అట్టూరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని అఘోరీ మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది.
Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్
శుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని లేడీ అఘోరీ డిమాండ్ చేసింది. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.
( Uttar Pradesh | aghori | lady aghori arrest | arrest | Mokila | aghori sri varshini | Aghori Sri Varshini)