/rtv/media/media_files/2025/05/05/1FUh71cs2HFypyadetza.png)
Info leak
పాకిస్తాన్‌లోని ఏజెన్సీలతో కుమ్మకై సున్నితమైన సమాచారాన్ని(Info leak) లీక్ చేస్తున్నారన్న ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ ప్రకారం అరెస్టయిన వ్యక్తులు పాలక్ షేర్ మాసిహ్ , సూరజ్ మాసిహ్ గా గుర్తించారు. అమృత్సర్‌లోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల ఫోటోలతో పాటుగా వివరాలను పాకిస్తాన్ నిర్వాహకులకు లీక్ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
#BREAKING: In a major counter-espionage operation, #PunjabPolice arrests Palak Sher Masih & Suraj Masih for leaking sensitive info on Army & Air Force bases in Amritsar. Links traced to Pak intel via inmate Harpreet Singh. Case under Official Secrets Act.#India #Punjab #Pakistan
— Sahil Haq (@sahil_haq86755) May 4, 2025
పాకిస్తాన్ ఫోన్ నంబర్లతో
అనుమానితుల మొబైల్ ఫోన్ల నుండి పాకిస్తాన్ ఫోన్ నంబర్లతో పాటు సున్నితమైన ప్రదేశాలకు సంబంధించిన అనేక ఫోటోలను స్వాధీనం చేసుకున్నట్లు అమృత్‌సర్ గ్రామీణ ఎస్‌ఎస్‌పి మనీందర్ సింగ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులుకు పాకిస్తాన్ ఏజెంట్ల నుంచి లీక్ చేసిన ప్రతి సమాచారానికి రూ.5,000 నుండి రూ.10,000 వరకు తీసుకున్నారు.
Also read : India vs Pakistan : భారత్‌ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్ మరోసారి క్షిపణి ప్రయోగం?
నిందితులకు పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో ఘోరమైన పహల్గామ్ దాడి తర్వాత అనుమానితులు మరింత చురుకుగా మారారని ప్రతి అంశాన్ని పాకిస్తాన్‌లోని ఏజెన్సీలకు పంపుతున్నట్లుగా వెల్లడైంది. కాగా ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైర్సన్ లోయలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదుల బృందం అమాయకమైన టూరిస్టులపై కాల్పులు జరపగా 26 మంది చనిపోయారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read : PM Modi: ఆర్మీ సూట్‌లో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్