/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-50-3.jpg)
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు తప్పేలా లేవు. తన దేశం నుంచి పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటున్నా ఆమెను విడిచి పెట్టడం లేదు ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం. బంగ్లా ఛీఫ్ అడ్వైజర్ గా బాధ్యతలు చేపట్టిన యూనస్ హసీనాతో పాటూ మాజీ మంత్రుల, అధికారులు మొత్తం 12 మందిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అయితే ఆమె లాస్ట్ ఇయర్ ఆగస్టు నుంచి భారత్ లోనే ఉన్నారు. మన ప్రభుత్వం అండతో ఇక్కడ తలదాచుకున్నారు. ఇప్పుడు హసీనాను బయటకు రప్పించేందుకు బంగ్లా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఇంటర్ పోల్ ను ఆశ్రయించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా మరో 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆదేశ పోలీసులు ఇంటర్ పోల్ ను కోరారు. ఈ సంస్థ రెడ్ నోటీసులు ఇస్తే నిందితులు ఏ దేశంలో ున్నా అరెస్ట్ చేసేందుకు వీలు అవుతుంది.
వరుస అరెస్ట్ వారెంట్లు...
రీసెంట్ గా మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె కుమారుడు సజీబ్ వాజిద్‌కు రాజధాని ఢాకా శివార్లలో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో కోర్టు అరెస్టు వారెంట్లు జారీచేసింది. మరో 16 మందికి ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ ప్రత్యేక జడ్జి అరెస్టు వారెంట్లు జారీచేశారు. నిందితులు అందరూ కూడా పరారీలో ఉన్నారని.. దీనిపై ఏప్రిల్ 29కల్లా తెలియజేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఢాకా శివార్లలో దౌత్యవేత్తల కోసం ఉద్దేశించిన పూర్వాచల్ న్యూటౌన్‌లో 1.86 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను హసీనా, ఆమె బంధువులు చేజిక్కించుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ ఆరోపిస్తూ గత డిసెంబరులో బంగ్లా అవినీతి నిరోధ కమిషన్ దర్యాప్తు మొదలుపెట్టింది.
today-latest-news-in-telugu | bangladesh | sheik-hasina | arrest
Also Read: AP Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది...